పవర్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్, డిప్యూటి సిఎం ఆన్ డ్యూటీ

రెండేళ్ళ నుంచి వేచి చూస్తున్న తరుణం వచ్చేసింది. డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్... తిరిగి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గా మారారు. అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న సినిమా షూటింగ్ లు తిరిగి మొదలయ్యాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 23, 2024 | 02:19 PMLast Updated on: Sep 23, 2024 | 2:28 PM

Pawan Kalyan Join Shooting For Harihara Veeramallu

రెండేళ్ళ నుంచి వేచి చూస్తున్న తరుణం వచ్చేసింది. డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్… తిరిగి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గా మారారు. అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న సినిమా షూటింగ్ లు తిరిగి మొదలయ్యాయి. విజయవాడ వరదల కారణంగా ఆలస్యమవుతున్నాయి అనుకున్న షూట్ లు అన్నీ మళ్ళీ తిరిగి ప్రారంభించారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మూడు సినిమాలకు సైన్ చేసిన సంగతి తెలిసిందే. హరిహర వీరమల్లు సినిమా ముందు విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడింది. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ కావడంతో సినిమాలు వాయిదా పడుతూ వచ్చాయి.

మూడు సినిమాల నిర్మాతలు దర్శకులు పవన్ కళ్యాణ్ ను ఇటీవల కలిసినా సినిమాల షూటింగ్ విషయంలో స్పష్టత రావడం లేదు. ఎట్టకేలకు ఇటీవల పవన్ కళ్యాణ్ తిరిగి షూటింగ్ కి హాజరు అవుతాను అని ప్రకటించారు. తాజాగా సినిమా షూటింగ్ కి పవన్ కళ్యాణ్ హాజరు అయ్యారు. పవన్ కు ఇబ్బంది లేకుండా విజయవాడ సమీపంలోనే సెట్ ఏర్పాటు చేసింది చిత్ర యూనిట్. దీనితో అధికారులతో సమీక్ష అనంతరం నేరుగా షూటింగ్ కి హాజరు అయ్యారు. ఉదయం 7 గంటల నుంచే పవన్ కళ్యాణ్ తో షూట్ ప్రారంభమైంది.

మార్చి 28, 2025న సినిమాను విడుదల చేయనుంది చిత్ర యూనిట్. ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ లో పాల్గొనే అవకాశం ఉంది. సినిమా కథ విషయంలో కొన్ని మార్పులు ఉండటంతో… హరీష్ శంకర్ దృష్టి పెట్టాడు. ఈ మూడు సినిమాలు వచ్చే ఏడాది విడుదల కావడం పక్కాగా కనపడుతోంది. అయితే పవన్ తర్వాతి ప్రాజెక్ట్ ల విషయంలో స్పష్టత రావడం లేదు. సందీప్ రెడ్డి వంగా ఒక కథను పవన్ కళ్యాణ్ కోసం సిద్దం చేసారని, ఆ సినిమాను 2025 లో మొదలుపెట్టే ఛాన్స్ ఉందని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. కాని అది ఎంత వరకు నిజం అనేది క్లారిటీ లేదు.