Pawan Kalyan: పవన్ కళ్యాణ్ తలచుకుంటే అయిపోయినట్లే..!
పవన్‌కల్యాణ్ తలచుకుంటే.. ఏదైనా సాధిస్తాడు. కానీ.. ఇంతకాలం తలచుకోలేదా? పవర్‌స్టార్ ఒక్కసారి పవర్ చూపిస్తే.. ఐదు నెలల్లో సినిమా రిలీజ్ అవుతుంది.

pawan-kalyan
పవన్, సాయిధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న సినిమా షూటింగ్ స్టార్ట్ చేసి నెల అయిందో లేదో.. జులై 28న రిలీజ్ అంటూ ఎనౌన్స్ చేయడంతో.. ఫ్యాన్స్ అయితే తమనితాము గిల్లుకుని మరీ నిజమని నమ్ముతున్నారు. తమిళ హిట్ వినోదయ సిత్తమ్ రీమేక్‌లో తేజు హీరోగా .. పవన్ గోపాల గోపాల మాదిరి ముఖ్య పాత్రలో కనిపిస్తాడు. ఫిబ్రవరి 22న షూటింగ్ మొదలుకాగా.. ఇంకో వారం రోజుల్లో పవన్ పార్ట్ పూర్తవుతుంది.
వినోదయ సిత్తమ్ రీమేక్ రిలీజ్‌కు ఇంకా నాలుగు నెలలు పడుతుంది. ఈలోగా సాయిధమర్‌తేజ్ సీన్స్‌తోపాటు.. గ్రాఫిక్స్ వర్క్ కంప్లీట్ చేసి జులై 28న థియేటర్స్‌లోకి తీసుకొస్తారు. ఒరిజినల్ వెర్షన్ తీసిన సముద్రఖని దర్శకత్వంలో ఈ రీమేక్ రూపొందుతోంది. ఈ సినిమా రిలీజ్ అవుతున్న రెండు వారాలకే.. చిరంజీవి భోళాశంకర్ ఆగస్ట్ 11న రిలీజ్ అవుతోంది. అన్నదమ్ముల మధ్య బాక్సాఫీస్ వార్ నడిచినా.. రెండు వారాల గ్యాప్ వుండడం లెక్కలోకి రాకపోవచ్చు.
రెండున్నరేళ్ల క్రితం మొదలైన హరిహర వీరమల్లు షూటింగ్ ఇంతవరకు పూర్తికాలేదు. ఇప్పటికే చాలా రిలీజ్ డేట్స్ ఎనౌన్స్ చేసి.. మాట మీద నిలబడలేపోవడంతో.. విడుదల తేదీనే ప్రకటించడం మానేశారు. రెండేళ్లుగా వెయిట్ చేసిన హరీశ్ శంకర్ సినిమాకు ఓపెనింగ్‌తో మోక్షం వచ్చినా ఇంతవరకు రెగ్యులర్‌షూటింగ్ మొదలు కాలేదు. కానీ. నెల క్రితం మొదలైన రీమేక్‌లో పవన్ పోర్షన్ దాదాపు పూర్తికావడం.. రిలీజ్ డేట్ కూడా ఎనౌన్స్ చేయడం అందరికీ పెద్ద షాకే. పవన్ కాన్సన్‌ట్రేషన్ చేయడుగానీ.. చేస్తే.. ఇలాగే వుంటుందంటూ ఖుషీగా వున్నారు అభిమానులు.