PAWAN KALYAN: పవన్ సినిమా కొనేశారు.. ఇప్పుడు భయపడుతున్నారు..
పవన్ సినిమా కొన్న బయ్యర్లు ఎప్పుడు సేఫ్ జోన్‌లోనే ఉంటారు. ఒక వేళ నష్టాలొచ్చినా రజినీకాంత్ స్టైల్లో డిస్ట్రిబ్యూటర్లకు, బయ్యర్లకు నష్టపరిహారం పవన్ ఇస్తాడు. కాబట్టి, అలా కూడా వాళ్లు సేఫ్ జోన్‌లో ఉన్నట్టే. కాని ఉస్తాద్ భగత్ సింగ్ విషయంలో రెండు కారణాలతో బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు భయపడుతున్నారు.
PAWAN KALYAN: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా బాగోలేదంటేనే బాక్సాఫీస్ షేక్ అవుతుంది. యావరేజ్ టాక్ వస్తే వసూళ్ల వరదొస్తుంది. ఇక హిట్ టాక్ వస్తే అది బ్లాక్ బస్టర్ అనుకోవాల్సిందే. ఆ రేంజ్‌లో పవన్ సినిమాలు మార్కెట్‌ని షేక్ చేస్తాయి. కాబట్టే తన సినిమా కొన్న బయ్యర్లు ఎప్పుడు సేఫ్ జోన్‌లోనే ఉంటారు. ఒక వేళ నష్టాలొచ్చినా రజినీకాంత్ స్టైల్లో డిస్ట్రిబ్యూటర్లకు, బయ్యర్లకు నష్టపరిహారం పవన్ ఇస్తాడు.
Rashmika Mandanna: వదలని లీకులు.. జేజెమ్మలా శ్రీవల్లి..
కాబట్టి, అలా కూడా వాళ్లు సేఫ్ జోన్‌లో ఉన్నట్టే. కాని ఉస్తాద్ భగత్ సింగ్ విషయంలో రెండు కారణాలతో బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు భయపడుతున్నారు. ఒకటి ఈ సినిమా రైట్స్‌ని ముందుగా బుక్ చేసుకునేందుకు, తలా 5 కోట్లు ముందుగానే టోకెన్ ఎమౌంట్ ఇచ్చారట. కాని, ఏపీ ఎలక్షన్స్ అయ్యేందుకు నెలన్నర, ఆ తర్వాత ఓజీ షూటింగ్‌తో మరో రెండు మూడు నెలలు ఆ సినిమాకే అంకితమవుతాడు పవన్. అదే జరిగితే ఉస్తాద్ భగత్ సింగ్ ఎప్పుడు పూర్తవుతుందో.. ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలీదు. ఈ సినిమాకే అడ్వాన్స్ ఎమౌంట్ ఇచ్చేసిన బ్యాచ్, ఓజీ రైట్స్ కొనే పరిస్థితి ఉండదు. కాబట్టి, ఓజీ కంటే ముందే ఉస్తాద్ భగత్ సింగ్ రైట్స్‌ని బుక్ చేసుకున్న బ్యాచ్, ముందుగా ఈ మూవీనే పూర్తిచేయాలంటున్నారట.
ఈ సినిమా డిలే అయితే వడ్డీలు కట్టుకుంటూ ఉండాలి. తీరా రిలీజ్‌కి రెడీ అయితే, మిగతా ఎమౌంట్ ఇచ్చి పూర్తిగా రైట్స్ సొంతం చేసుకునే పరిస్థితి ఉండదు. అందుకే ఉస్తాద్ భగత్ సింగ్ రైట్స్‌ని కొంత ఎమౌంట్ ఇచ్చి బుక్ చేసుకున్న బయ్యర్స్, డిస్ట్రిబ్యూటర్స్‌లో కొంతమంది టెన్షన్ పడుతున్నారు. వాళ్ల కంగారు అర్ధం చేసుకున్న పవన్, ఓజీకి, ఉస్థాద్ భగత్ సింగ్ షూటింగ్‌కి ప్యారలల్‌గా డేట్లు ఇస్తానని మాటిచ్చాడట.