Pawan Kalyan: పవన్ కళ్యాణ్ షాక్.. “OG” షూటింగ్ మామూలుగాలేదు..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ షాక్ అయ్యాడు. అవుతున్నాడు.. అలా షాక్ అయ్యేలా చేస్తున్నాడు యంగ్ డైరెక్టర్ సుజీత్.. నిజమే వన్ సింగిల్ షెడ్యూల్ లో తన ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ మూవీ తాలూకు 20 శాతం షూటింగ్ పూర్తి చేశాడట.

Pawan Kalyan Movie Shooting
15 రోజుల్లో ఇంత పర్సెంటేజ్ షూటింగ్ అంటే, 40 రోజుల్లో టాకీ, మరో 20 రోజుల్లో పాటలు పూర్తి చేసే ఛాన్స్ ఉంది. మొన్న ముంబై, నిన్న పూనాలో ఓ యాక్షన్ సీన్, మూడు కంటిన్యూటీ సీన్లు, తర్వాత ఓ సాంగ్ ని తెరకెక్కించాడు సుజీత్. సాహో తో పడ్డ పంచ్ ని, మచ్చని చెరిపేసుకునేందుకు పవర్ స్టార్ ని టార్గెట్ చేశాడు.
తనతో ఓజీ మూవీ తీస్తున్నాడు. లక్కీగా త్రివిక్రమ్ సపోర్ట్ దొరకటంతో ఓజీ మూవీ వేగంగా తెరకెక్కుతోంది. ఫస్ట్ షెడ్యూల్ లోనే 20శాతం షూటింగ్ అంటే, కొత్త షెడ్యూల్ ఆతర్వాత షెడ్యూల్ లో ఎంత షూటింగ్ అవుతుందో ఊహించలేం.. అదే విషయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంప్రెస్ అయ్యాడట. షూటింగ్ లో ఉత్సాహంగా ఉంటున్నాడట. ఈ ఊపు చూస్తుంటే,మరో ప్రాజెక్ట్ కి కూడా సుజీత్ కి దార్లు తెరుచుకున్నట్టే అంటున్నారు. నిజానికి సంక్రాంతికి ఉస్తాద్ భగత్ సింగ్, సమ్మర్ కి ఓజీ అన్నారు. కానీ ఈ దూకుడు చూస్తుంటే దసరా, లేదంటే దీపావళికే ఈ మూవీ థియేటర్స్ లో దర్శనమిచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదనుకోవచ్చు.