PAWAN KALYAN: హంగ్రీ చీతాగా మారిన ఓజీ.. కారణం అదేనా?
ఏదేమైనా ఓజీ మాత్రం వర్కింగ్ టైటిలే అన్నారు. దీంతో అసలు టైటిల్ ఏంటా అనుకునేలోపు హంగ్రీ చీతా రిజిస్టర్ అయ్యింది. ఓజీ బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌లో వినిపించిన హంగ్రీ చీతా పదాన్నే సినిమా టైటిల్‌గా పెట్టాలని ఫిల్మ్ టీం డిసైడ్ అయ్యిందంటున్నారు.

OG is also one of the upcoming movies of Power Star Pawan Kalyan. Hungry Cheetah is a small teaser from Ozzy as Pawan's birthday gift
PAWAN KALYAN: సాహో ఫేం సుజీత్ డైరెక్షన్‌లో పవన్ చేస్తున్న ఓజీ షూటింగ్ 50శాతం పూర్తయ్యాకే పవన్ పొలిటికల్‌గా బిజీ అయ్యాడు. ఏప్రిల్ నెలవరకు.. ముఖ్యంగా ఏపీ ఎలక్షన్స్ పూర్తయ్యే వరకు పవన్ బిజీ కాబట్టి, మే నెల్లోనే ఓజీ పెండింగ్ షూటింగ్ మొదలయ్యే ఛాన్స్ ఉంది. ఈలోపు మాత్రం సుజీత్ టీం షాక్ ఇచ్చిందో, అప్‌డేట్ ఇచ్చిందో తేల్చుకోలేని పరిస్థితి ఫ్యాన్స్‌కి ఎదురైంది. అదే ఓజీ టైటిల్ మారిపోవటం.
India vs England: ముగిసిన రెండో రోజు ఆట.. ఇంగ్లండ్ ఆలౌట్.. భారత్‌కు 171 పరుగుల ఆధిక్యం
ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ అని కొంతకాలం ప్రచారం జరిగింది. తర్వాత ఓజాస్ గంభీరకి ఇది షార్ట్ ఫాం అంటూ ప్రచారం చేశారు. ఏదేమైనా ఓజీ మాత్రం వర్కింగ్ టైటిలే అన్నారు. దీంతో అసలు టైటిల్ ఏంటా అనుకునేలోపు హంగ్రీ చీతా రిజిస్టర్ అయ్యింది. ఓజీ బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌లో వినిపించిన హంగ్రీ చీతా పదాన్నే సినిమా టైటిల్‌గా పెట్టాలని ఫిల్మ్ టీం డిసైడ్ అయ్యిందంటున్నారు. కాకపోతే.. ఆ పదం ఫేమస్ అవటం వల్లే ఎవరైనా సినిమాకు పెట్టేసుకుంటారని, ముందు జాగ్రత్తగా ఆటైటిల్ రిజిస్టర్ చేశారే కాని, టైటిల్ మార్పులేదని మరో ప్రచారం మొదలైంది.
ఏదేమైనా, హరి హర వీరమల్లు మూవీ మూలకు పడి చాలా కాలం అవ్వటంతో, పెండింగ్ షూటింగ్‌ని జూన్‌లో మొదలు పెట్టాలనుకుంటున్న క్రిష్, ఈ సినిమాకు ఫ్రెష్‌నెస్ తెచ్చేందుకు టైటిల్ మార్చాలనుకుంటున్నాడట. హరీష్ శంకర్ కూడా ఉస్తాద్ భగత్ సింగ్ టైటిల్ మార్పు మీద కసరత్తులు చేస్తున్నాడట. అందుకే ఓజీ టీం హంగ్రీ చీతాను రిజిస్టర్ చేయగానే ఓజీ టైటిల్ కూడా మారుతోందని ప్రచారం మొదలైంది.