Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దెబ్బంటే అలా ఉంటుంది..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్లానింగ్ దిమ్మతిరిగేలా ఉంది. 2024 తర్వాత తను సినిమాలు చేయొచ్చు.. చేయకపోవచ్చనే అభిప్రాయం ఎప్పటినుంచో ఉంది. పార్ట్ టైం సినిమాలు చేస్తాడేమో అనుకుంటే, 2024 ఎలక్షన్స్ లో వచ్చే రిజల్ట్ మీదే తన ప్లానింగ్ ఆధారపడిఉంది.

Pawan Kalyan Movie Updates
ఇక అసలు విషయానికొస్తే, పవన్ ఎలక్షన్స్ కి ముందే 4 సినిమాలు పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యాడు. అది కూడా హరి హర వీరమల్లు తో సహా.. సెట్లో అగ్నిప్రమాధం తన మనసుని మార్చిందో, ప్లానింగ్ అలా ఉందో కాని, హరిహర వీరమల్లుకి 25 రోజుల కాల్ షీట్స్ ఇచ్చిన పవన్ ఈ దసరాలోగా అన్ని సినిమాల షూటింగ్స్ పూర్తి చేస్తాడట.
ఆల్రెడీ బ్రో షూటింగ్ అయిపోయింది జులై లో రాబోతోంది. ఓజీ షూటింగ్ స్పీడ్ గా జరుగుతోంది. ఈ మూవీ క్రిస్మస్ కి రిలీజ్ చేయాలన్న పవన్ కండీషన్ ప్రకారం ఫిల్మ్ టీం దూసుకెళుతోంది. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ ఏప్రిల్ లో రిలీజ్ అంటున్నారు. హరి హర వీరమల్లు వచ్చే ఏడాది దసరాకే వస్తుందనంటున్నారు. కాకపోతే షూటింగ్ మాత్రం ఈ దసరాలోగానే అన్ని పూర్తవుతాయట.
ఎలక్షన్స్ లో ఈసారి టీడీపీ, జనసేన కలిసి నెగ్గే అవకాశాలు ఎక్కువ ఉండటం, సీఎం పదవిని రెండు పార్టీలు పంచుకునే ఛాన్స్ ఉండటంతో, పవన్ ఫోకస్ అంతా పాలిటిక్స్ వైపే పెడుతున్నాడు. సో తను ఏ సినిమా చేసినా ఈ దసరాలోపే ఉండాలని ఫిక్స్ అయ్యాడు. అందుకే ఒకేసారి నాలుగు సినిమాలు పూర్తిచేసే పనిలో ఉన్నాడు.