Pawan Kalyan: అట్లుంటది పవర్ స్టార్ తో పెట్టుకుంటే.. పవర్ ఫుల్ శిక్ష..
పవర్ స్టార్ తో గేమ్స్ పవర్ ప్లాంట్ తో జోక్స్ రెండూ మంచివి కావు. కాని అదే తప్పు చేసింది పూజాహెగ్డే. పవన్ తో హరీష్ శంకర్ ఎప్పుడో ప్లాన్ చేసుకున్న మూవీకి మొదట్లో సై అంది. తర్వాత నై అంది.. కట్ చేస్తే చేసిన తప్పుకి ఇప్పుడు చెంపలేసుకుంటోంది.

Harish Shankar pooja Hegde
స్వింగ్ లో ఉన్నప్పుడు పవన్ తో జోడీ కట్టే ఛాన్స్ వచ్చింది. కాని ఉస్తాద్ భగత్ సింగ్ ప్రాజెక్ట్ షూటింగ్ షురూ కాక, డిలే అవుతూ ఉందని ప్రాజెక్ట్ నుంచి బయటికొచ్చింది పూజా . కట్ చేస్తే తన ప్లేస్ లో శ్రీలీలా వచ్చి తిష్టేసింది. ఇంతలో పూజా హెగ్డేకి 5 ప్లాపులతో ఐరన్ లెగ్ అనే స్టాంప్ పడిపోయింది. మహేశ్ బాబు సినిమా తప్ప చేతిలో సింగిల్ సినిమాలేదు. దీంతో పూజా హెగ్డే ఫ్యూచరే డైలామాలో పడింది.
అందుకే కెరీర్ ని రిపేర్ చేసుకునేందుకు పూజా హెగ్డే పని షురూ చేసినట్టుంది. హరీష్ శంకర్ తో డీజే, గద్దలకొండ గణేష్ మూవీలు చేసిన అనుభవం, క్లోజ్ నెస్ కారణంగా, ఉస్తాద్ భగత్ సింగ్ లో హీరోయిన్ రోల్ కోసం పీఆర్ టీంతో సంప్రదింపులు పెంచిందట. కాని శ్రీలీలను తీసేయటానికి ఫిల్మ్ టీం రెడీగా లేకపోవటంతో, సెకండ్ హీరోయిన్ రోల్ కి కూడా పూజా ఒప్పేసుకుందని, పవన్ మాత్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది.