Pawan Kalyan: ఓహ్ మై గాడ్… పవర్ ఫుల్ క్యాలెండర్ మారింది..!
కొత్త అప్‌డేట్ ఏంటంటే, సాయితేజ్‌తో పవన్ కలిసి చేసిన బ్రో జులై 28న రిలీజ్ అవటంలో ఎలాంటి మార్పు లేదు. కాని ఓజీ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ విడుదల తేదీల్లో మార్పులపై క్లారిటీ వచ్చేసింది. నిజానికి క్రిస్మస్‌కి ఓజీ లేదంటే ఉస్తాద్ భగత్ సింగ్‌ని ప్లాన్ చేశారు.

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిర్ణయాలు, చర్యలు ఊహాతీతం. కాని అన్నీ వర్కవుట్ అవుతాయి. అదంతే ఆ క్రేజ్ అలాంటింది మరి. ఇక కొత్త అప్‌డేట్ ఏంటంటే, సాయితేజ్‌తో పవన్ కలిసి చేసిన బ్రో జులై 28న రిలీజ్ అవటంలో ఎలాంటి మార్పు లేదు. కాని ఓజీ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ విడుదల తేదీల్లో మార్పులపై క్లారిటీ వచ్చేసింది.
నిజానికి క్రిస్మస్‌కి ఓజీ లేదంటే ఉస్తాద్ భగత్ సింగ్‌ని ప్లాన్ చేశారు. సమ్మర్ తర్వాత హరి హర వీరమల్లు రిలీజ్ అన్నారు. కాని సంక్రాంతికి ఒరిజినల్ గ్యాంగ్ స్టర్‌గా పవన్ రావటం ఆల్ మోస్ట్ కన్ఫామ్ అయ్యింది. జనవరి 11న అంటే ప్రాజెక్ట్ కే, గుంటూరు కారం సినిమాలతో పాటు పవర్ ఫుల్ సినిమా కూడా రావటం కన్ఫామ్ అయ్యింది. దీంతో పవన్, ప్రభాస్, మహేశ్ మధ్య ట్రయాంగిల్ వార్ ఉండబోతోంది. ఒకరకంగా ఆడియన్స్‌కి పండక్కి మూడు ఆప్షన్స్ దొరికినట్టే కనిపిస్తోంది. ఇక సంక్రాంతికి ఓజీ వస్తుంటే, ఉగాదికి ఉస్తాద్ భగత్ సింగ్ రావటం కూడా ఫైనలైందట.
దీనికి తగ్గట్టే షూటింగ్ ప్లానింగ్ జరుగుతోంది. 22 రోజుల కాల్ షీట్స్ ఓజీ కొత్త షెడ్యూల్‌కి పవన్ కేటాయించాడంటేనే, సంక్రాంతికి రంగంలో దిగేందుకు పవన్ ఇలా ప్రిపేర్ అవుతున్నట్టు తెలుస్తోంది. హరి హర వీరమల్లు మాత్రం వచ్చే ఏడాది మే 25 లేదంటే జూన్ ఫస్ట్ వీక్ విడుదలయ్యేలా ప్లాన్ చేస్తున్నారట. ఎలక్షన్స్ టైంలో హరిహర వీరమల్లు బొమ్మ తెరమీద పడేలా పవన్ టీం ప్లాన్ చేస్తోందట.