పవన్ కళ్యాణ్, నాని, రాజమౌళి.. ముగ్గురిలో ఉన్న కామన్ క్వాలిటీ గెస్ చేయగలరా..?
పవన్ కళ్యాణ్, నాని, రాజమౌళి.. ముగ్గురిలో ఒక కామన్ క్వాలిటీ ఉంది. ఏంటబ్బా అది అని ఆలోచిస్తున్నారు కదా..! రాజమౌళి, నాని అంటే చెప్పొచ్చు.. ఇద్దరు కలిసి ఈగ సినిమా చేశారు.

పవన్ కళ్యాణ్, నాని, రాజమౌళి.. ముగ్గురిలో ఒక కామన్ క్వాలిటీ ఉంది. ఏంటబ్బా అది అని ఆలోచిస్తున్నారు కదా..! రాజమౌళి, నాని అంటే చెప్పొచ్చు.. ఇద్దరు కలిసి ఈగ సినిమా చేశారు. అలా ఇద్దరి మధ్య ఒక కామన్ క్వాలిటీ ఉంది అని అర్థమవుతుంది. కానీ వీళ్ళ మధ్యలోకి పవన్ కళ్యాణ్ ఎందుకు వచ్చాడు.. అసలు పవన్ కళ్యాణ్ రాజమౌళితో సినిమా ఎప్పుడు చేయలేదు.. ఇంకా చెప్పాలంటే పవన్ తోనే సినిమా చేయాలని రెండు మూడు సంవత్సరాల పాటు ఎదురు చూశాడు రాజమౌళి. ఈ విషయం స్వయంగా ఆయనే పంజా సినిమా ఆడియో ఫంక్షన్ లో చెప్పాడు. తన కెరీర్లో ఎప్పుడు ఏ హీరోతో సినిమా చేయాలి అనుకోలేదు కానీ.. ఒక పవన్ కళ్యాణ్ తో మాత్రమే సినిమా చేయాలి అనుకున్నాను కానీ కుదరలేదు అని చెప్పాడు జక్కన్న. విక్రమార్కుడు సినిమా స్టోరీ ముందు రాజమౌళి చెప్పింది పవన్ కళ్యాణ్ కే. ఆ తర్వాత మరో కథ కూడా చెప్పే ప్రయత్నం చేశాడు కానీ.. పవన్ ఉన్న బిజీకి, రాజమౌళి కమిట్మెంట్స్ కు అసలు సెట్ అవలేదు.
దాంతో ఒక సెన్సేషనల్ కాంబినేషన్ చూసే అదృష్టం మిస్ అయిపోయారు తెలుగు ఆడియన్స్. ఇప్పుడు ఇతని కాంబినేషన్లో సినిమా అనేది ఇక కల. ఎందుకంటే పవన్ సినిమాలు చేయడు.. అడిగిన డేట్స్ ఇవన్నీ హీరో వైపు రాజమౌళి అసలు చూడడు. మీరు అన్నీ చెప్తున్నారు కానీ.. అసలు విషయం మాత్రం దాచి పెడుతున్నారు అని తిట్టుకుంటున్నారు కదా..! అక్కడికే వస్తున్నాం.. పవన్, నాని, రాజమౌళి మధ్యలో కచ్చితంగా ఒక కామన్ క్వాలిటీ అయితే ఉంది. అదే 100% సక్సెస్ రేట్. కావాలంటే చెక్ చేసుకోవచ్చు నేనేమీ అబద్ధం చెప్పడం లేదు. పవన్ కళ్యాణ్ చేసిన సినిమాలో సగానికి పైగా డిజాస్టర్స్ ఉన్నాయి.. అలాంటప్పుడు ఆయన ఎలా 100% సక్సెస్ రేట్ కొట్టాడు అనుకోవచ్చు.. ఒకసారి సినిమా కాదని రాజకీయాల వైపు వెళ్ళండి. ఇండియన్ పాలిటిక్స్ లో ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కాని స్థాయిలో 100% సక్సెస్ రేట్ చేసి చూపించాడు జనసేనాని. ఇక రాజమౌళి సక్సెస్ రేట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చేసిన అన్ని సినిమాలతో హిట్ కొట్టిన ఘనత ఈయనది. అలా ఈయన కూడా 100 పర్సెంట్ సక్సెస్ రేట్ సొంతం చేసుకున్నాడు.
మరి నాని లెక్క ఏంటి అనుకుంటున్నారు కదా.. అక్కడికే వస్తున్నాం. హీరోగా నానికి కొన్ని ఫ్లాప్స్ ఉండొచ్చు కానీ నిర్మాతగా మాత్రం నాని ఇంత వరకు ఫెయిల్ కాలేదు. ఆయన ట్రాక్ రికార్డు చెక్ చేసుకోవచ్చు.. ఆయన వాల్ పోస్టర్ సినిమాలో ప్రశాంత్ వర్మతో అ..!, శైలేష్ కొలనుతో హిట్, హిట్ 2.. తాజాగా కొత్త దర్శకుడు రామ్ జగదీష్ తో కోర్ట్ సినిమాలు నిర్మించాడు నాని. ఇవన్నీ సక్సెస్ ఫుల్ వెంచర్స్. నిర్మాతగా ప్రతి సినిమాతో లాభాలు అందుకున్నాడు న్యాచురల్ స్టార్. ఈ లెక్కన నాని కూడా 100% సక్సెస్ రేట్ అందుకున్నట్టే. ఈ లిస్టులో అనిల్ రావిపూడి జస్ట్ మిస్ అయ్యాడు. చేసిన ఎనిమిది సినిమాలలో ఎఫ్3 ఒక్కటే యావరేజ్ దగ్గర ఆగిపోయింది.. మిగిలిన అన్ని సినిమాలు బాగానే ఆడాయి. మొత్తానికి అలా పవన్, నాని, రాజమౌళి మధ్య 100% సక్సెస్ రేట్ అని కామన్ క్వాలిటీ ఉంది.