Pawan Kalyan: ఓజీ షూటింగ్‌లో జనసేన జెండా.. ఇదెక్కడి ఫాలోయింగ్ స్వామీ..!
ఎక్కడ పడితే అక్కడ ఫ్యాన్స్ ఉంటారమ్మా.. చూసుకోవాలి. నిజానికి భరత్ అనే నేను సినిమాలో మహేష్ బాబు చెప్పే డైలాగ్. కానీ ఇదే డైలాగ్ పవర్ స్టార్ పవన్ కల్యాన్‌కు రియల్ లైఫ్‌లో సరిగ్గా సరిపోతుంది.

Janasena Flag In OG Movie Shooting
తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో పవన్ కల్యాణ్ టాప్. నిజంగానే పవన్‌కు ఎక్కడపడితే అక్కడ ఫ్యాన్స్ ఉంటారు. ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా.. అక్కడ మీకు ఓ పవన్ ఫ్యాన్ కనిస్తాడు అని పవన్ ఫ్యాన్స్ గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు. వీళ్లు నార్మల్ ఫ్యాన్స్‌గా ఉంటారా అంటే లేదు! ఆయన మీద అభిమానాన్ని అదేదో ఉద్యమంలా చూపిస్తుంటారు. ఇక పవన్ రాజకీయాల్లోకి వచ్చిన తరువాత పవన్ ఫ్యాన్స్ అంతా జనసైనిక్స్ ఐపోయారు.
రీసెంట్‌గా ఏపీ బోర్డర్‌లో తనకు కనిపించిన జనసైనిక్స్ ఫొటోలను ట్విటర్‌లో షేర్ చేశాడు పవన్ కళ్యాణ్. సుజీత్ డైరెక్షన్‌లో పవన్ కల్యాణ్ ఓజీ అనే సినిమా తీస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్‌ను ప్రజెంట్ ఏపీ మహారాష్ట్ర బోర్డర్‌లో షూట్ చేస్తున్నారు. సినిమా షూటింగ్ జరుగుతున్న టైంలో అటుగా ఓ బోట్ వచ్చింది. వాళ్లు అనుకోకుండా వచ్చారా అంటే కాదు. పవన్‌ను చూసేందుకు వచ్చిన లోకల్ ఫ్యాన్స్ వాళ్లు. జనసేన జెండాను పట్టకుని బోట్‌లో వచ్చారు. వాళ్లను చూసి పవన్ చాలా సంతోషించారు. షూటింగ్ సమయంలో మన జనసైనిక్స్ కనిపించారంటూ ఆ సందర్భాన్ని ఫ్యాన్స్‌తో పంచుకున్నారు. మారుమూల ప్రాంతాల్లో కూడా జనసైనికులను కలవడం చాలా సంతోషంగా ఉందంటూ ట్వీట్ చేశాడు.