Pawan Kalyan: OG స్టోరీలైన్‌ ఇదే.. ఇక బాక్సాఫీస్‌ బద్దలే..

పోలీస్‌ బికేమ్‌ గ్యాంగ్‌స్టర్‌. ఈ థీమ్‌ సినీ ప్రపంచానికి కొత్త కాదు.. కానీ టాలీవుడ్‌లో మాత్రం ఇలాంటి థీమ్‌తో వచ్చిన సినిమాలు చాలా తక్కువ. మంచి మాస్‌ ఫాలోయింగ్‌ ఉన్న హీరో ఇలాంటి యాక్షన్‌ సినిమా చేస్తే మినిమం హిట్‌ కొట్టడం గ్యారెంటీ. ఇక పవర్‌ స్టార్‌ లాంటి హీరోతో ఈ థీమ్‌ని తెరకెక్కిస్తే బొమ్మ దద్దరిల్లడం పక్కా.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 22, 2023 | 03:15 PMLast Updated on: Apr 22, 2023 | 3:15 PM

Pawan Kalyan Og Directed By Sujith

ఇప్పుడు పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌, డైరెక్టర్‌ సుజీత్‌ కాంబినేషన్‌లో వస్తున్న ఓజీ సినిమాను ఇదే లైన్‌తో తెరకెక్కించబోతున్నారనే టాక్‌ నడుస్తోంది. హానెస్ట్‌గా పని చేస్తున్న ఓ పోలీస్‌ ఆఫీసర్‌.. జ్యుడీషియల్‌ సిస్టంలో ఉన్న లొసుగులను కరెక్ట్‌ చేయలేక విసుగు చెంది గ్యాంగ్‌స్టర్‌గా మారితే ఎలా ఉంటుంది.. అనే లైన్‌తో ఓజీ సినిమాను తీస్తున్నాడట సుజీత్‌. దీని గురించి అఫీషియల్‌ ఎనౌన్స్‌మెంట్‌ లేకున్నా సినీ వర్గాల్లో టాక్‌ గట్టిగానే వినిపిస్తోంది. యాక్షన్‌ సీక్వెన్స్‌ను సుజీత్‌ ఎలా ప్రజెంట్‌ చేస్తాడో సాహో సినిమాతో ఆల్రెడీ చూశాం. అనుకున్న రేంజ్‌లో సాహో హిట్‌ అవ్వకపోయినా.. సుజీత్‌ డైరెక్షన్‌కు మాత్రం మంచి మార్కులు పడ్డాయి.

బాహుబలి తరువాత ప్రభాస్‌ చేసిన సినిమా కావడంతో సాహో మీద ఫ్యాన్స్‌ ఓ రేంజ్‌లో హోప్స్‌ పెట్టుకున్నారు. కానీ వాళ్ల అంచనాలను సుజీత్‌ రీచ్‌ కాకపోవడంతో సినిమా పెద్దగా హిట్‌ అవ్వలేదు. ఓవర్‌గా ఎక్స్‌పెక్టేషన్స్‌ పెట్టుకోవడమే సాహో సినిమా ఫ్లాప్‌కు కారణమనేది మూవీ అనలిస్ట్‌ల వాదన. ఒక రకంగా చెప్పాలి అంటే అదే నిజం కూడా. సాహో నుంచి నేర్చుకున్న పాఠంతో ఓజీ సినిమాను గట్టిగా ప్లాన్‌ చేస్తున్నాడు సుజీత్‌. ఈ స్క్రిప్ట్‌ కోసం రెండేళ్లు వర్క్‌ చేశాడట.

ఫైనల్‌గా కథ రెడీ చేసి పవన్‌ కళ్యాణ్‌కు చెప్పి ఒప్పించాడట. ఒరిజనల్‌ గ్యాంగ్‌స్టర్‌ అనగానే యాక్షన్‌ మూవీ అని అంతా ఫిక్స్‌ అయ్యారు. కానీ పోలీస్‌ గ్యాంగ్‌స్టర్‌గా మారబోతున్నాడని తెలియడంతో ఫ్యాన్స్‌లో క్యూరియాసిటీ మరింత పెరిగిపోయింది. పవర్‌ స్టార్‌ చరిష్మాకు సుజీత్‌ మార్క్‌ ఎలివేషన్‌ తోడైతే రిజల్ట్‌ ఎలా ఉంటుందనే ఆలోచనే గూస్‌బంప్స్‌ తెప్పిస్తున్నాయంటున్నారు ఫ్యాన్స్‌. ఇప్పుడు వచ్చిన లీక్‌తో పవర్‌ స్టార్‌ ఫ్యాన్స్‌ మాత్రమే కాదు. నార్మల్‌ మూవీ లవర్స్‌ కూడా సినిమా కోసం ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు.