Pawan Kalyan: అభిమానుల్లారా ఊపిరి పీల్చుకోండి.. సెప్టెంబర్ 2.. పవర్ తుఫాన్ ఖాయం..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ పోస్టర్ విడుదల చేశారు. ఈ సినిమాకి సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారు.

Pawan Kalyan OG Movie First Look Poster
పవన్ కల్యాణ్ డాన్ రోల్ చేస్తే.. తుపాకీ చేతిలో పట్టుకుంటే.. 70ఎంఎం స్క్రీన్ కూడా చిన్నగా కనిపించదా ఎవరికైనా ! ఐతే అదే జరగబోతోంది. అభిమానులకు ఫుల్ జోష్ ఇచ్చేందుకు పవర్‌స్టార్ రెడీ అవుతున్నాడు. పవన్ సినిమాలు ఎలా ఉన్నా.. తన స్క్రీన్ ప్రెసెన్స్ కోసం ఫ్యాన్స్ ఎప్పుడూ ఎదురుచూస్తుంటారు. కమర్షియల్ సినిమాలకు మెసేజ్ అద్ది ప్రేక్షకులను మెప్పించడం పవన్ కల్యాణ్‌కే సాధ్యం. ప్రస్తుతం పవన్ చేతిలో ఉన్న సినిమాలన్నీ.. ఒకదానితో మరొకటి సంబంధం లేని జోనర్లలోనే ఉన్నాయ్. వాటిలో ఎక్కువ క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్న మూవీ ఓజీ. పవన్ గ్యాంగ్‌స్టర్‌లా కనిపించబోతున్నాడు ఇందులో ! స్టైలిష్ డైరెక్టర్ సుజిత్ డైరెక్ట్ చేస్తుండడంతో.. పవన్ ఇంకెంత స్టైలిష్‌గా కనిపించబోతున్నాడా అనే అంచనాలు అభిమానుల్లో పెరిగిపోయాయ్. అంచనాలకు ఏ మాత్రం తీసిపోకుండా.. మూవీ టీమ్ రిలీజ్ చేసిన లుక్.. ఇప్పుడు ఫ్యాన్స్‌ను ఖుషీలో ముంచేస్తోంది.
సెప్టెంబర్ 2న పవన్ పుట్టినరోజు సందర్భంగా ఓజీ నుంచి క్రేజీ అప్డేట్ రాబోతోంది. ఐతే అసలు విషయం ఏమిటనేది మేకర్స్ ప్రకటించలేదు. త్వరలోనే అంటూ అప్‌డేట్ ఇస్తూ ఊరించారు. తప్పకుండా ఈ మూవీ నుంచి గ్లింప్స్ రిలీజ్ చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఐతే ఓజీ నుంచి విడుదలైన ఈ స్పెషల్ పోస్టర్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తోంది. రాత్రి.. ఓ పెద్ద బిల్టింగ్.. రక్తపు మడుగులో శవాలు.. గన్ పట్టుకొని నడుస్తూ వెళ్తున్న పవన్.. చుట్టూ గార్డ్స్.. అదిరిపోయింది పోస్టర్ అంతే ! ఇదే ఇలా ఉందంటే.. గ్లింప్స్, టీజర్, ట్రైలర్ మీ ఊహకే వదిలేస్తున్నాం అన్నట్లు పోస్టర్ రిలీజ్ చేసింది మూవీ టీమ్.
దీంతో సెప్టెంబర్ 2 కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇక సుజీత్ డైరెక్షన్‌లో పవన్ యాక్ట్ చేస్తున్నాడు అనగానే.. పంజాలాంటి స్టైలిష్ గ్యాంగ్‌స్టర్ డ్రామాను ఊహించేసుకున్నారు ఫ్యాన్స్. పంజాలో కలకత్తాలో ఉండే గ్యాంగ్‌స్టర్‌గా పవన్ పర్ఫార్మెన్స్, స్టైల్.. ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. సినిమా కమర్షియల్‌గా సక్సెస్ అవ్వకపోయినా.. పవన్ కెరీర్‌లో గ్యాంగ్‌స్టర్ సినిమా అంటే పంజానే అని ఫిక్స్ అయిపోయారు. ఇప్పుడు మళ్లీ అలాంటి మ్యాజిక్ జరగబోతుందని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీలో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా యాక్ట్ చేస్తుండగా.. తమిళ నటుడు అర్జున్ దాస్, నటి శ్రియా రెడ్డి కీ రోల్ ప్లే చేస్తున్నారు.