Pawan OG : పవన్ కళ్యాణ్ ఓజి లేటెస్ట్ అప్ డేట్.
పవర్ స్టార్ (Power Star) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మూవీ సినీ మార్కెట్ లో ఉన్నా లేకపోయినా ఆయన గురించి చర్చ మాత్రం నడుస్తూనే ఉంటుంది.

Pawan Kalyan OG Latest Update.
పవర్ స్టార్ (Power Star) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మూవీ సినీ మార్కెట్ లో ఉన్నా లేకపోయినా ఆయన గురించి చర్చ మాత్రం నడుస్తూనే ఉంటుంది. ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ అలాంటిది మరి. మూవీ బాగుందా లేదా అనేది కూడా అనవసరం. తెర మీద ఆయన కనపడితే చాలు ఆ కిక్కే వేరప్పా అనుకుంటారు.ఇక సోషల్ మీడియాలో కొన్ని రోజులుగా పవన్ గురించి ఒక రూమర్ స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు దాని మీద క్లారిటీ వచ్చింది
పవన్ అప్ కమింగ్ మూవీ ఓజి (OG) పాన్ ఇండియా (Pan India) లెవల్లో విడుదల అవుతున్న ఈ మూవీ మీద అందరిలోను భారీ అంచనాలే ఉన్నాయి. షూటింగ్ కూడా ముగింపు దశకు వచ్చింది. కేవలం పవన్ మీద తెరకెక్కించాల్సిన సీన్స్ మాత్రమే బ్యాలన్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో మేకర్స్ పవన్ డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. కానీ పవన్ ప్రస్తుతం ఎలక్షన్స్ మూడ్ లో ఉన్నాడు. దీంతో ఎలక్షన్స్ అయ్యాక షూటింగ్ లో జాయిన్ అవుతాడనే ప్రచారం కొన్ని రోజుల నుంచి వినిపిస్తుంది. ఇప్పుడు ఈ వార్తలో ఎలాంటి నిజం లేదని తెలుస్తుంది. ఎలక్షన్స్ అయిన వెంటనే కాకుండా రిజల్ట్ వచ్చాకే షూట్ లో కి ఎంట్రీ ఇస్తారని తెలుస్తుంది. ఒక పది రోజులు పవన్ కాల్షీట్స్ ఇస్తే మూవీ కంప్లీట్ అవుతుంది
ఇక ఈ మూవీకి ఆర్ఆర్ఆర్ (RRR) ప్రొడ్యూసర్ దానయ్య నిర్మాత కాగా సుజీత్ దర్శకుడు. థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ప్రియాంక మోహన్ తొలిసారి పవన్ తో జోడి కడుతుంది. ఆల్రెడీ ఇప్పటికే వచ్చిన చిన్నపాటి టీజర్ యూ ట్యూబ్ లో రికార్డ్స్ సృష్టిస్తుంది. సెప్టెంబర్ 27 న వరల్డ్ వైడ్ గా విడుదల అవుతుండగా ఇదే డేట్ కి గతంలో పవన్ హిట్ మూవీ అత్తారింటికి దారేది వచ్చింది.