వాడేమైనా దిగొచ్చాడా? అల్లు అర్జున్ అరెస్ట్ విషయం లో రేవంత్ చేసింది కరెక్ట్.
సంధ్య థియేటర్ ఘటన విషయంలో ఏపీ డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజుతో భేటీ సందర్భంగా పవన్ కళ్యాణ్ సెన్సేషనల్ కామెంట్స్ చేసారు.
సంధ్య థియేటర్ ఘటన విషయంలో ఏపీ డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజుతో భేటీ సందర్భంగా పవన్ కళ్యాణ్ సెన్సేషనల్ కామెంట్స్ చేసారు. సమాజం పై ప్రభావం చూపించేలా ఎందుకు సినిమా ఉండకూడదు అనిపిస్తుందన్న పవన్… సినిమాకు సంబంధించిన ఆడిట్ జరగాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. అల్లు అర్జున్ అంశం గోటితో పోయేదానిని గొడ్డలి వరకూ తెచ్చుకోవడమే అని క్లియర్ కట్ గా చెప్పేశారు పవన్. తెలంగాణ ప్రభుత్వం చాలా గౌరవప్రదంగా, మర్యాద పూర్వకంగా ఉంది సినిమాతో అంటూ పవన్ కామెంట్స్ చేసారు.
ప్రతీ హీరో చేసిన సినిమాకు స్తుతి కోరుకుంటాడని హీరో తాను చేసిన సినిమాను ప్రజలు ఎలా చూస్తున్నారు అనేది తెలుసుకోవాలనుకుంటాడన్నారు పవన్. అల్లు అర్జున్ అంశంలో మరింతగా ముందస్తు ఏర్పాట్లు జరిగి ఉండాల్సిందని డిప్యూటి సీఎం తన ఒపినియన్ చెప్పారు. ఎవరైనా అల్లు అర్జున్ స్టాఫ్ కానీ, సినిమా హాలు వాళ్ళు కానీ ముందుగా చెప్పి ఉండాలని మనం ఎంత ప్రముఖులమైనా న్యాయం అందరికీ సమానమే అన్నారు. నేను అందుకే సినిమా హాల్స్ కి వెళ్ళను అన్నారు పవన్ కళ్యాణ్.
సినిమా బాగునప్పుడు ప్రజల మన్ననలు చూడటానికి వెళ్తామని ప్రజల రెస్పాన్స్ కి వెలకట్టలేని అంశం అన్నారు. సినిమా హాల్ కి వెళ్లి చూడటం అనేది అందరూ చెయ్యడం లేదని ఇప్పుడు ఉన్న పరిస్థితిలో హీరో లు సినిమాలకు వెళ్లి చూసే పరిస్థితి లేదన్నారు పవన్. అల్లు అర్జున్ అంశంలో అధికారులను ఇబ్బంది పెట్టడమే అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసారు డిప్యూటి సీఎం. అల్లు అర్జున్ సిబ్బంది అల్లు అర్జున్ కి చెప్పాల్సిందన్నారు. చట్టం అనేది అందరికీ సమానమే అన్నారు పవన్.
బాధితుల కుటుంబంకి హీరో కి తెలియకుండానే… సినిమా యూనిట్ వెళ్లి భరోసా ఇస్తే బాగుండేదన్నారు. కనీసం బాధిత కుటుంబం ఇంటికి మూడో రోజు అయినా హీరోగా అల్లు అర్జున్ వెళితే బాగుండేదన్నారు పవన్. సినిమా అనేది యూనిట్ గా తీసినప్పుడు ఏదైనా రాంగ్ జరిగినప్పుడు అందరు బాధ్యత వహించాలన్నారు. బాధిత కుటుంబం ఇంటికి ఎవరో ఒకరు ఆ రెండో రోజే వెళ్ళి చెప్పి మాట్లాడి మేం తోడున్నాం అని చెపితే ఇంత జరిగేది కాదనే ఒపినియన్ చెప్పారు. బాధిత కుటుంబాన్ని వెంటనే పరామర్శించాల్సిందన్నారు. ఎవరైనా కనిపిస్తే చెయ్యి ఊపాలని, అభివాదం చేయాలి అనే ఆలోచన ప్రతీ హీరోకి ఉంటుందని సారీ అని చెప్పడానికి పలు విధానాలు ఉంటాయంటూ పవన్ కామెంట్స్ చేసారు. రేవంత్ రెడ్డి కాబట్టే హీరో నీ అరెస్టు చేయగలిగారన్నారు పవన్. తన మీద కేసు పెట్టినా తాను కూడా అడ్డు పడలేను అన్నారు. తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి గారు వైసిపి లా వ్యవహరించలేదని తెలంగాణ ప్రభుత్వం బినిఫిట్ షో కి అనేక అవకాశాలు ఇచ్చిందని టికెట్ రేట్స్ పెంచకపోతే రికార్డ్స్ ఎలా వస్తాయని సెటైర్ లు వేసారు.