Pawan Kalyan: అన్నదమ్ములు కానున్న మామ అల్లుళ్ళు.. వినోదయ సీతం రీమేక్ టైటిల్ ఇదేనా..?

మామా అల్లుళ్లు పవన్‌కల్యాణ్‌, సాయిధరమ్‌ తేజ్‌ హీరోలుగా పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై వినోదయ సీతాం రీమేక్ చేస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాకు స్క్రిప్ట్ విషయంలో త్రివిక్రమ్ సముద్రఖనికి చాల హెల్ప్ చేసారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 10, 2023 | 10:15 AMLast Updated on: May 10, 2023 | 5:46 PM

Pawan Kalyan Sai Dharam Tej Vinodaya Sitam

ప్రస్తుతం వినోదయ సీతం రీమేక్ వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు బ్రో అనే టైటిల్ ఫిక్స్ చేసే ఆలోచనలో ఉన్నారట మూవీ మేకర్స్. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ దేవుడి పాత్రలో కనిపించబోతున్నాడు. సినిమా మొత్తం పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ ఇద్దరు బ్రో అని పిలుచుకుంటారట. దీనితో ఈ సినిమాకు బ్రో అనే టైటిల్ ఫిక్స్ చేసే ఆలోచనలో ఉన్నాడట డైరెక్టర్.

ప్రస్తుతం సినిమా షూటింగ్ దాదాపు కంప్లీట్ అయ్యింది.పవన్ కళ్యాణ్ టాకీ పార్ట్ లు చాల ఫాస్ట్ గా కంప్లీట్ గా చేశారు. ఈ సినిమాను తమిళ్ లో కూడా సముధ్రఖని దర్శకత్వం వహించాడు. తమిళ్ లో సినిమా మంచి హిట్ అయ్యింది. మూవీ మీద కథ మీద మంచి గ్రిప్ ఉండటంతో.. తెలుగులో సినిమాను చాల ఫాస్ట్ గా షూట్ చేసాడు సముధ్రఖని. సీరియల్స్ కూడా డైరెక్ట్ చేసిన ఎస్ పీరియన్స్ ఉండటంతో షూటింగ్ ఈజీ అయింది.

సినిమాలు ఎంత ఫాస్ట్ గా స్టార్ట్ చేశారో అంతే ఫాస్ట్ గా షూటింగ్ కూడా కంప్లీట్ చేస్తున్నారు. అవుట్ ఫుట్ గురించి ఎలాంటి టెన్షన్ లేకుండా కాన్ఫిడెంట్ గా సినిమా తీస్తున్నాడు సముధ్రఖని. జులై 28 న సినిమాలు రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేశారు. ప్రస్తుతం వర్కింగ్ టైటిల్ తో వర్క్ నడుస్తున్న ఈ సినిమాకు బ్రో అనే టైటిల్ దాదాపు ఫిక్స్ అయిన్నట్టు సమాచారం. ఇదే టైటిల్ ను మరో 2 లేదా 3 రోజుల్లో అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంటుంది అంటున్నారు. అయితే ఈ సినిమాకు బ్రో తో పాటు దేవుడే దిగి వచ్చినా, కాల భైరవ అనే టైటిల్ ను కూడా పరిశీలిస్తున్నట్టు సమాచారం. అయితే ఈ టైటిల్స్ లో త్రివిక్రమ్ దేన్ని ఫైనల్ ఫైనల్ చేస్తారో చూడాలి.