Pawan Kalyan: పవన్ కళ్యాణ్ నో చెప్పడంతో.. డైలామాలో శంకర్..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎప్పుడూ ఫలానా డైరెక్టర్ తో పనిచేయాలని పిలిచింది లేదు. ఒకరి వెంటపడిందిలేదు. ఎంతపెద్దదర్శకుడైనా తన వరకు వచ్చిన మూవీలే చేశాడు. ఐతే అలా ఇప్పుడు ఏకంగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకరే వచ్చి పవన్ తో సినిమా ప్లాన్ చేస్తా అన్నా పవర్ స్టార్ ఒప్పుకోవట్లేదట.

Star Director Movie Offer Rejected by Pawan Kalyan
ఇలా జరగటం ఇది రెండో సారి అంటున్నారు. నిజానికి గతంలోనే పవన్ కళ్యాణ్ కోసం కథ రెడీ చేశాడు శంకర్. కాని ఆ కథ తనకంటే రామ్ చరణ్ కే బాగా సెట్ అవుతుందని దిల్ రాజు, ఆ ప్రాజెక్ట్ కి చెర్రి చేతులో పెట్టాడు. అలా గేమ్ ఛేంజర్ మూవీ పట్టాలెక్కింది. ఇప్పుడు మరోసారి శంకర్ వెళ్లి పవన్ కి కథ చెప్పాడని తెలుస్తోంది.
ఐతే ఈ సారి కూడా శంకర్ కి పవన్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదట. ఓజీ తోపాటు ఉస్తాబ్ భగత్ సింగ్ మూవీలు చేస్తున్న పవన్, హరి హర వీరమల్లు షూటింగ్ ని కూడా పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఆతర్వాత ఏపీలో ఎలక్షన్స్ ఉన్నాయి. సో కనీసం ఏడాది వరకు పవన్ మరే దర్శకుడితో సినిమాకు కమిటయ్యే పరిస్థితి లేదు. ఎలాగూ శంకర్ తో సినిమా అంటే కనీసం ఏడాదైనా సెట్ కే పరిమితం కావాలి.. గతంతో రాజమౌళి లాంటి దర్శకుడు కథ చెబితేనే ఏళ్లకు ఏళ్లు డేట్లు ఇవ్వడం కష్టమని పవన్ తనతో సినిమా చేయలేదు. సో మరి శంకర్ తో సినిమా ఎలా ఒప్పుకుంటాడు.. అందుకే కథ నచ్చినా పవన్ మాత్రం శంకర్ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట. ఏదైనా ఛాన్స్ ఉంటే ఏపీ ఎలక్షన్స్ తర్వాతే ఉండొచ్చని, అది కూడా దిల్ రాజునే నిర్మిస్తాడని తెలుస్తోంది.