Ram Charan: చెర్రీ పుట్టినరోజున పవన్ ఎమోషనల్ మెసేజ్.. ఏం గిఫ్ట్ ఇచ్చాడంటే..
చెర్రీ బర్త్‌డే సందర్భంగా.. చరణ్ బాబాయ్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆస్కార్ పురస్కారాలు పొందిన చిత్రంలో నటించి గ్లోబల్ స్టార్ స్థాయికి చేరుకున్న రాంచరణ్‌కు.. హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అని పవన్ ట్వీట్ చేశారు.
Ram Charan: మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ పుట్టినరోజు వేడుకలు గ్రాండ్‌గా జరుగుతున్నాయ్. చిరంజీవి బ్లడ్‌బ్యాంక్ దగ్గర ఉదయం నుంచే ఫ్యాన్స్ సందడి మొదలైంది. పుట్టినరోజు సందర్భంగా.. తిరుమల స్వామివారిని కుటుంబంతో పాటు చెర్రీ దర్శించుకున్నారు. సోషల్ మీడియా వేదికగా రాంచరణ్‌కు ఫ్యాన్స్ విషెస్ చెప్తున్నారు. టాలీవుడ్, పొలిటికల్ సెలబ్రిటీలు కూడా.. రాంచరణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తున్నారు.
RC17 : RC17 స్టోరీ లీక్…
చెర్రీ బర్త్‌డే సందర్భంగా.. చరణ్ బాబాయ్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆస్కార్ పురస్కారాలు పొందిన చిత్రంలో నటించి గ్లోబల్ స్టార్ స్థాయికి చేరుకున్న రాంచరణ్‌కు.. హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అని పవన్ ట్వీట్ చేశారు. చరణ్ కు సంపూర్ణ ఆనందాన్ని, సుఖ సంతోషాలను అందించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని చెప్పారు. దైవ భక్తి మెండుగా ఉన్న చరణ్ ఎప్పుడూ సానుకూల దృక్పథంతో ఆలోచిస్తాడని అన్నారు. పెద్దలు, అనుభవజ్ఞులపై గౌరవ మర్యాదలతో ఉంటాడని పొగడ్తలు గుప్పించారు. అవే చెర్రీకి శ్రీరామ రక్షగా నిలుస్తాయని.. మరింత ఉన్నత స్థాయికి ఎదగడానికి దోహదపడతాయని రాసుకొచ్చి.. తన ప్రేమను చాటుకున్నారు. తండ్రికి తగ్గ తనయుడిగా ముందుకు వెళ్తున్న చరణ్ రానున్న రోజుల్లో మరిన్ని అవకాశాలను అందుకోవాలని మనస్పూర్తిగా ఆకాంక్షిస్తున్నానని ట్వీట్ చేశాడు.
ఐతే రాంచరణ్ అంటే పవన్‌కు ఎంత ప్రేమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాంచరణ్ తన అన్న కొడుకు కాదని.. తన కొడుకే అని, తమ్ముడులాంటోడు అని.. రంగస్థలం ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో స్టేజి మీదే ముద్దు పెట్టుకున్నాడు. అంత ప్రేమ చెర్రీ అంటే పవన్‌కు. ఎన్నికల సమయం కావడంతో.. పవన్ బిజీగా ఉన్నాడు. ఐతే అబ్బాయ్‌కు బాబాయ్ గిఫ్ట్ ఇవ్వడం కాదు.. జనసేన తరఫున ప్రచారానికి వచ్చి.. బాబాయ్‌కు అబ్బాయ్ గిఫ్ట్ ఇవ్వాలంటూ.. సోషల్ మీడియాలో కొత్త చర్చ మొదలైంది.
రామ్ చరణ్ మరింత ఉన్నత స్థాయికి ఎదగాలి – JanaSena Chief Shri @PawanKalyan @AlwaysRamCharan #HBDRamCharan #HBDGlobalStarRamCharan pic.twitter.com/TSpL9BsA8c
— JanaSena Party (@JanaSenaParty) March 27, 2024