Pawan Kalyan: హరిహర వీరమల్లు కోసం పవన్ పాట.. సాంగ్ అంతకుమించి.. పూనకాలు గ్యారంటీ..
పాలిటిక్స్‌కు చిన్న బ్రేక్ ఇచ్చిన పవన్.. వరుసపెట్టి సినిమాలు కంప్లీట్ చేస్తున్నాడు. ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు.. ఇలా పవన్ ఫ్యాన్స్‌కు పండగ రోజులు రాబోతున్నాయ్ త్వరలో ! పండగకు మించి న్యూస్ ఒకటి తెగ వైరల్ అవుతోంది. హరిహర వీరమల్లు మూవీ కోసం పవన్ మళ్లీ సింగర్ అవతారం ఎత్తబోతున్నాడు. ఓ ఫుల్‌లెన్త్ సాంగ్ పాడబోతున్నట్టు టాక్.

Pawan sing song on Hara Hara veera Mallu
ఆ పాట పవన్ పాడితేనే బాగుంటుందని.. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి పట్టుపట్టడంతో.. పవర్ స్టార్ గొంతు సవరించుకున్నాడని.. మూవీలో కీలక సన్నివేశంలో ఆ సాంగ్ వస్తుందని తెలుస్తోంది. దీంతో అది క్లాస్ సాంగా.. మాస్ సాంగా అని అభిమానుల్లో అప్పుడే అంచనాలు మొదలయ్యాయ్. ఇప్పటికే తమ్ముడు, గుడుంబా శంకర్, జానీ, అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి, పంజా సినిమాల్లో పవన్ పాటలు పాడారు. ఐతే అన్ని సినిమాల్లో కేవలం బిట్ సాంగ్స్ మాత్రమే పాడాడు. హరిహరలో మాత్రం ఫుల్ పాట పాడబోతున్నాడు. మాములుగా పవన్ బొమ్మ చూస్తేనే పూనకాలకు పూనకాలు తెప్పించేస్తారు ఫ్యాన్స్.
ఇక పవన్ పాట వింటే.. థియేటర్లు టాప్ లేవాల్సిందే ! పీరియాడికల్ మూవీగా వస్తున్న హరిహర వీరమల్లు మూవీని.. క్రిష్ డైరెక్ట్ చేస్తున్నాడు. నిజానికి ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది. గత దసరాకే ప్రేక్షకుల ముందుకు రావాలి. జరగలేదు. సంక్రాంతి పోయింది.. ఉగాది పోయింది.. సినిమా అయినా ఉంటుందా అని అభిమానులు టెన్షన్ పడ్డారు. ఐతే సినిమా ఉంది.. అడిషనల్‌గా పవన్ పాట కూడా ఉంది అని తెలియడంతో పవర్ ఫ్యాన్స్ జోరుకు బ్రేకుల్లేకుండా పోతోంది. మొగల్ చక్రవర్తి ఔరంగజేబు కాలంలో.. బందీపోటు దొంగ వీరమల్లు స్టోరీ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఔరంగజేబు పాత్రను బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ప్లే చేస్తున్నాడు.