Pawan Kalyan: నాన్నకు ప్రేమతో.. పవన్ కోసం అకీరా పాట.. కన్నీళ్లు ఆపుకోండి..
పండుగ కోసం ఇండియా వచ్చిన అకీరా.. బెంగళూరులో మెగా ఫ్యామిలీతో కలిసి సంబరాల్లో పాల్గొన్నాడు. అక్కడ రాత్రి పూట అందరూ సరదాగా సేద తీరుతుంటే.. అకీరా నందన్ తన పియానో మీద కొన్ని సాంగ్స్ ప్లే చేసి వినిపించాడు.
Pawan Kalyan: పవన్‌కల్యాణ్‌తో విడాకుల తర్వాత.. రేణుదేశాయ్ పిల్లలతో కలిసి పుణేలో ఉంటున్నారు. ఏవైనా పనులు ఉన్నప్పుడు హైదరాబాద్ రావడమే తప్ప.. రేణు పెద్దగా మెగా ఫ్యామిలీతో కలిసింది లేదు. పిల్లలు అకీరా, ఆద్యను మాత్రం.. మెగా కుటుంబం ప్రతీ ఈవెంట్‌కు పిలుస్తుంటుంది. తాజా సంక్రాంతికి కూడా పిలిచింది. అకీరా, ఆద్యను ఆ వేడుకల్లో చూసి అభిమానుల కళ్లను తెలియకుండానే నీళ్లు కమ్మేశాయ్. పవన్ బాటలోనే అకీరా కూడా సినిమాల్లోకి వచ్చి, హీరో అవుతాడని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.
GUNTUR KAARAM: గురూజీ ఎక్కడ..? త్రివిక్రమ్ లేకుండా గుంటూరు కారం సెలబ్రేషన్స్
ఐతే అకీరా హీరో అవడని.. యాక్ట్ చేయకపోయినా టాలీవుడ్‌లోనే ఉంటాడని క్లారిటీ ఇచ్చిది. అకీరా పియానో బాగా ప్లే చేస్తాడు. గతంలో ఓ షార్ట్ ఫిల్మ్‌కు మ్యూజిక్ కూడా చేశాడు. ప్రస్తుతం అమెరికాలోని ఓ ఫిలిం స్కూల్‌లో.. అకీరా మ్యూజిక్ నేర్చుకుంటున్నాడు. పండుగ కోసం ఇండియా వచ్చిన అకీరా.. బెంగళూరులో మెగా ఫ్యామిలీతో కలిసి సంబరాల్లో పాల్గొన్నాడు. అక్కడ రాత్రి పూట అందరూ సరదాగా సేద తీరుతుంటే.. అకీరా నందన్ తన పియానో మీద కొన్ని సాంగ్స్ ప్లే చేసి వినిపించాడు. అకీరా ప్లే చేసిన ఓ పాట ఇప్పుడు అభిమానులతో కన్నీళ్లు పెట్టిస్తోంది. యానిమల్ మూవీలోని నాన్న నువ్వు నా ప్రాణం అనే సాంగ్‌ని.. పియానో మీద అకీరా ప్లే చేశాడు. దీన్ని రికార్డు చేసిన ఉపాసన.. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీగా పెట్టుకుంది. అకీరా నువ్ సూపర్ అంటూ కామెంట్ పెట్టింది. ఈ వీడియో కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అకీరా ప్లే చేసిన పాటను.. ఇప్పుడు ప్రతీ ఒక్కరు ఓన్ చేసుకుంటున్నారు.
నాన్న నువ్ నా ప్రాణం అంటూ అకీరా ప్లే చేసిన సాంగ్.. అభిమానులను ఎమోషనల్ చేస్తోంది. పవన్‌ను అకీరా ఎంత మిస్ అవుతున్నాడో పాపం అంటూ.. వీడియో చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఏ కొడుక్కి అయినా.. ఎదిగే వయసులో తండ్రి పక్కన ఉండడం అవసరం. అలాంటిది తండ్రికి దూరంగా.. అకీరా ఉండటం.. తలుచుకుంటేనే బాధగా ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు. పవన్ మీద ప్రేమ ఎంత ఉందో అని.. అకీరా ఎప్పుడూ బయటకు చెప్పకపోవచ్చు. కానీ.. ఈ పాట రూపంలో తనకు తండ్రి అంటే ఎంత ఇష్టమో చెప్పకనే చెప్పినట్లు అనిపిస్తోంది. ఇది ఇప్పుడు ప్రతీ ఒక్కరిని ఎమోషనల్ చేస్తోంది.