Pawan Kalyan: పవర్ స్టార్ మాటిచ్చాడు
పవన్ కళ్యాణ్ బ్రో తర్వాత ఓజీ షూటింగ్ కి రెడీ అయ్యాడు. మొన్న కరాటే ప్రాక్టీస్ ఫోటో ని రిలీజ్ చేసి సుజీత్ షాక్ ఇచ్చాడు. సరే హరి హర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ పరిస్థితి ఎలా ఉన్నా ఓజీ అయినా వేగంగా పూర్తయ్యే లా ఉందని ఫ్యాన్స్ సర్దుకుపోతున్నారు.

Pawan Kalyan starrer film OG directed by Sujith has released a karate photo related to it
కట్ చేస్తే గుడ్ న్యూస్ ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ కి రెక్కలొచ్చేలా ఉన్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు హరీష్ శంకర్ ని పిలిచి మరీ ప్రామిస్ చేశాడట. ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ కోసం డేట్లు ఇచ్చేందుకు రెడీ అయ్యాడట.
కాకపోతే పవన్ కండీషన్ అప్లై అంటూ ట్విస్ట్ ఇచ్చాడట. ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ అలియాస్ ఓజీ మూవీ 80 శాతం పూర్తయ్యాకే ఉస్థాద్ భగత్ సింగ్ షూటింగ్ కి డేట్లిస్తాడట. అలా చూస్తే అక్టోబర్ లోగా ఓజీ పూర్తవుతుంది. అంటే నవంబర్ నుంచి ప్రతీ నెల ఉస్తాధ్ భగత్ సింగ్ షూటింగ్ కి పవన్ డేట్లిస్తాడనుకోవాలా? అదే జరిగేలా ఉంది. ప్రస్తుతానికి హరీష్ శంకర్ కి తన ఫ్యూచర్ మీద తనకు ఓ క్లారిటీ వచ్చినట్టుంది.