Pawan Kalyan: పవన్ కళ్యాణ్ డైరెక్టర్ ది కక్కుర్తా..? లేదంటే తెలివా..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సాహో ఫేం సుజీత్ సినిమా అనగానే లక్కీఫెలో అనుకున్నారు. నిజంగానే ఈ ఛాన్స్ ని వాడుకుంటూ, హీరోని కాకుండా తన వీడియోలతో ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ వదిలి, సుజీత్ తనని తాను ప్రమోట్ చేసుకున్నాడు. ఈ లాజిక్ నెమ్మదిగా పవన్ ఫ్యాన్స్ కిఅర్ధమైనా, సర్లే పవర్ స్టార్ మూవీ తీస్తున్నాడు కదా అని వాళ్లు ఊరుకున్నారు. సినిమా పూర్తై రిలీజ్ అయ్యాక ఏమాత్రం తేడా కొట్టినా వాళ్ల రియాక్షన్ మరోలా ఉంటుంది. అది వేరే విషయం అనుకోండి.

Director Sujith and Pawan kalyan Combo Movie
ఇక ఈమూవీ టైటిల్ ఎన్స్ మెంట్ తోనే తనని తాను ప్రమోట్ చేసుకోవాలన్న కోణంలో కక్కుర్తి పడ్డ సుజీత్, మరో విషయంలో కక్కుర్తి పడుతున్నాడంటున్నారు.అదే హీరోయిన్ విషయం. నిజానికి ఇందులో హీరోయిన్ గా ప్రియాంక మోహన్ ని తీసుకోవాలనుకోలేదు పవన్. ఇక నిర్మాత త్రివిక్రమ్ కూడా క్రుతి శెట్టిని సజెస్ట్ చేశాడట. కాని సుజీత్ ఈమూవీకి ప్రియాంకా మోహనే కావాలన్నాడని తెలుస్తోంది
గ్యాంగ్ లీడర్ నుంచి శ్రీకారం వరకు ప్రియాంకామోహన్ పెర్పామెన్స్ తో గాని, గ్లామర్ తోకాని ఆకట్టుకోలేదు. అలాంటి తను పవన్ సరసన అంటే ఊహించుకోవటం కష్టమే. కాని పవన్ ఎప్పుడు షూటింగ్ కి వస్తాడో, ఎప్పుడు బ్రేక్ ఇస్తాడో తెలియదు కాబట్టి, స్టార్ హీరోయిన్ ని పెట్టుకుని షూటింకి బ్రేక్ పడితే డేట్లు అడ్జెస్ట్ కావని, ఇలా ఖాలీగా ఉంటే హీరోయిన్ ని తీసుకున్నాడట. ఇదే నిజమైతే ఇది తెలివైన నిర్ణయం. అలా కాకుండా ఇండస్ట్రీ లో వస్తున్న పుకార్ల ప్రకారం చూస్తే కక్కుర్తే అంటున్నారు.