Pawan Kalyan: పవన్ సినిమాలన్నీ ఆగిపోనున్నాయి.. ఇప్పుడు దర్శక నిర్మాతల పరిస్థితి ఏంటి ?
ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న బిజీ హిరోస్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. అటు సినిమాలు ఇటు రాజకీయాలంటూ బిజీబిజీగా గడిపేస్తున్నాడు. చేతినిండా ప్రాజెక్ట్‌లు ఉన్నా.. రాజకీయానికి మాత్రం చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు.

Pawan Kalyan Break To Shooting
రీసెంట్‌గానే బ్రో సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న పవన్ ప్రస్తుతం ఓజీ, హరిహరవీరమళ్లు, ఉస్తాద్ భగత్‌సింగ్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. అయితే ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్‌లకు పవన్ బ్రేక్ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. దీనికి కారణం పాలిటిక్స్. ఏపీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ప్రచారానికి సిద్ధమౌతున్నాడు పవన్ కళ్యాణ్. జనసేన ప్రచార రథం వారాహితో ఉభయ గోదావరి జిల్లాలతో ఆయన ఎన్నికల ప్రచారం ప్రారంభించబోతున్నాడు. జనసేన పార్టీ నేతలు ఇప్పటికే గ్రౌండ్ స్థాయిలో అన్నీ ప్రిపేర్ చేశారు. రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. ఏ రోజు ఏ ఊర్లో పర్యటించాలో కూడా చాలా క్లియర్‌గా ప్లాన్ చేశారు.
ఈ ప్లాన్‌ని బట్టి చూస్తే.. జూన్ 14 నుంచి కొన్ని రోజుల పాటు పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో ఉంటాడు. రూట్‌మ్యాప్ ప్రకారం ప్రచారం ముగిసిని తరువాత మళ్లీ షూటింగ్ స్టార్ట్ చేస్తాడు. అయితే యాత్రలో అంతా సజావుగా జరిగితే కొన్ని వారాల్లో మళ్లీ షూటింగ్ స్టార్ట్ అవుతుంది. కానీ గతంలో పర్యటనను వైసీపీ నేతలు అడ్డుకున్నట్టు ఇప్పుడు కూడా ఏదైనా గలాటా జరిగితే.. షూటింగ్ ఇంకా లేట్ అయ్యే చాన్స్ ఉంది. ఇప్పుడు ఇదే టెన్షన్‌లో ఉన్నారు దర్శక నిర్మాతలు.
ఇప్పటికే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఎన్నో వాయిదాలను దాటుకుని రీసెంట్‌గానే షూటింగ్ ప్రారంభించుకుంది. హరిహరవీరమళ్లు సినిమా పరిస్థితి కూడా దాదాపు అంతే. ఓజీ షూటింగ్ సజావుగానే జరుగుతున్నా.. ఈ యాత్ర వల్ల ఆ సినిమా షూటింగ్‌కు కూడా బ్రేక్ పడటం ఖాయం. దీంతో ఎలా చూసినా కొన్ని వారాలా పాటు పవన్ సినిమాలన్నీ ఆగిపోనున్నాయి.