Pawan Kalyan: లెగ్గు బాబు లెగ్గు.. పవన్ కళ్యాణ్ వల్లే ఇదంతా.!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జస్ట్ ఒక హీరోయిన్ లైఫ్ లోకి అడుగుపెట్టాడంటే, ఆమె ఫేటేమారిపోయింది. ఇదే ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. ఆమే మలయాళ బ్యూటీ సంయుక్తా మీనన్..ఈలేడీ ఇప్పుడు టాలీవుడ్ బంగారులేడీ.. గోల్డెన్ లెగ్ ఆమె అడుగుపెట్టిన చోట కాసుల వర్షమే.

Samyuktha menon Golden Leg in Tollywood
భీమ్లానాయక్ లో పవన్ తో స్క్రీన్ షేర్ చేసుకుంది. బింబిసార చేసింది. సార్ లో జోరు పెంచింది. ఇప్పుడు విరూపాక్ష.. నాలుగు మూవీలు బ్లాక్ బస్టర్లే.. అంతే దెబ్బకి టాలీవుడ్ లో గెల్డెన్ లెగ్ ఈమే అంటున్నారు. 4 ఫ్లాపులతో పూజా హెగ్డే ఐరన్ లెగ్ అయ్యింది. పవన్ సినమాను కాదని ఉస్తాద్ భగత్ సింగ్ ఆఫర్ ని పోగొట్టుకుంది. తను అలా డీలా పడితే, సంయుక్తా మీనన్ మాత్రం వరుస హిట్లతో దూసుకెళుతోంది.
అంతా బానే ఉంది. వరుస హిట్లు, అందాల ఆరబోతలు ఇన్ని ఉన్నప్పుడు బేసిగ్గానే, ఆఫర్ల వరద రావాలి. కాని సంయుక్తా మీనన్ కి పెద్దగా ఆఫర్లు లేవు. దానికో కారణం ఉంది. తను షూటింగ్స్ కి మాత్రమే కాదు, ప్రమోషనల్ ఈవెంట్లకు కూడా లేటుగా వచ్చి నిర్మాతల్ని ఏడిపిస్తుందనే కంప్లైంట్ ఉంది. అందుకే ఎంత గోల్డెన్ లెగ్గైనా, ఒక్క సారి సినిమా తీయటం చాలనుకునే వాళ్ల సంఖ్య పెరిగింది. అందుకే అవకాశాల సంఖ్య తగ్గుతోందని తెలుస్తోంది.