Ustaad Bhagat Singh: గ్లాస్ అంటే సైజు కాదు సైన్యం.. కేక పుట్టిస్తోన్న భగత్ బ్లేజ్..
పవర్ స్టార్ చెప్పిన డైలాగ్.. పవన్ ఫ్యాన్స్‌లో కొత్త జోష్ నింపుతోంది. భగత్ బ్లేజ్ అంటే.. భగత్ మాత్రమే కనిపించాడు. గ్లింప్స్‌లో కనిపించినంతే.. బ్లేజ్‌లోనూ కనిపించింది శ్రీలీల. కాకపోతే అప్పుడు బ్యాక్ నుంచి.. ఇప్పుడు ఫ్రంట్ నుంచి అంతే!

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్.. పవర్ హీటర్ కలిస్తే.. భగత్ బ్లేజ్. సడెన్‌గా ఎందుకు రిలీజ్ చేశారో అర్థం కాలేదు కానీ.. బ్లేజ్ చూశాక ఇందుకే అని ఫిక్స్ అయ్యారు అంతా ! పగిలిన గాజు గ్లాస్.. పదునెక్కిన పవన్ మాటలు.. కట్ చేస్తే కేక పుట్టించే భగత్ బ్లేజ్. నిమిషం 2 సెకన్లు అలా చూస్తూ ఉండిపోతాం అంతే ! వెతకాలే కానీ.. ఈ గ్లింప్స్ స్టార్టింగ్ నుంచి పొలిటికల్ టచ్చే కనిపిస్తుంటుంది. పూజారులను రౌడీలు హింసిస్తుండడం.. లక్ష్మీనరసింహస్వామికి జై అంటూ నినాదాలు రావడం.. పవన్ కల్యాణ్ పవర్ ఫుల్ ఎంట్రీ ఇవ్వడం.. జనసేనాని గుర్తుకొస్తుంటాడు మధ్యలో!
Tripti Dimri: పుష్పరాజ్‌పై మనసు.. అల్లు అర్జున్‌తో త్రిప్తి డిమ్రి
నీ రేంజ్ ఇదీ అంటూ.. గాజుగ్లాస్‌ను విలన్ కింద పడేసిన తర్వాత.. పవన్ రియాక్షన్.. అదేదో వైసీపీకి వార్నింగ్‌లా వినిపిస్తుంటుంది. పగిలిన గ్లాస్ ముక్కను చేతుల్లోకి తీసుకొని.. పగిలేకొద్దీ గాజుకు పదునెక్కుద్ది అంటూ పవన్ చెప్పిన డైలాగ్‌లకు విజిల్ వేయకుండా ఉండలేరూ ఫ్యాన్స్ ఎవరూ కూడా ! కచ్చితంగా గుర్తుపెట్టుకో.. గ్లాస్ అంటే సైజు కాదు సైన్యం అంటూ.. పవర్ స్టార్ చెప్పిన డైలాగ్.. పవన్ ఫ్యాన్స్‌లో కొత్త జోష్ నింపుతోంది. భగత్ బ్లేజ్ అంటే.. భగత్ మాత్రమే కనిపించాడు. గ్లింప్స్‌లో కనిపించినంతే.. బ్లేజ్‌లోనూ కనిపించింది శ్రీలీల. కాకపోతే అప్పుడు బ్యాక్ నుంచి.. ఇప్పుడు ఫ్రంట్ నుంచి అంతే! ఐతే భగత్ బ్లేజ్ చూసి పవర్‌స్టార్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటుంటే.. ఇంకొందరు మాత్రం ఇది జనసేన పొలిటికల్ యాడ్‌లా ఉంది అంటూ సెటైర్లు వేస్తున్నారు. జనసేన పార్టీ తరఫున ప్రచారం కోసం వీడియో రిలీజ్ చేసినట్లు ఉంది తప్ప.. సినిమా కోసం ప్రత్యేకంగా విడుదల చేసినట్లు అనిపించడం లేదు అంటూ పెదవి విరుస్తున్నారు.
ఇదంతా ఎలా ఉన్నా.. బ్లేక్‌కు అదిరిపోయే బీజీఎం ఇచ్చాడు దేవిశ్రీప్రసాద్. పవర్‌ఫుల్ డైలాగ్‌కు అదే రేంజ్ పవర్‌ఫుల్ మ్యూజిక్ యాడ్ చేసి పిచ్చెక్కించాడు. పవన్‌కల్యాణ్‌కు డైరెక్టర్ హరీష్ శంకర్ భక్తుడి లెక్క. తన భక్తినంతా ఈ బ్లేజ్ రూపంలో చూపించాడు. ఇక ఈ మూవీపై భారీ అంచనాలు కనిపిస్తున్నాయ్. హరీష్, పవన్ కాంబినేషన్‌లో వచ్చిన గబ్బర్ సింగ్.. భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు అదే రిజల్ట్‌ను ఈ మూవీ రిపీచ్ చేస్తుందని ఫ్యాన్స్ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు.