Pawan Kalyan: యూట్యూబ్ లో రికార్డ్ సెట్ చేసిన ఉస్తాద్ భగత్ సింగ్..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గురించి తెలిసిందేగా ఏదీ ఓ పట్టాన ఒప్పుకోరు. పవన్ గురించి వచ్చిన అప్డేట్ అయినా, పొలిటికల్ న్యూస్ అయినా.. పవన్ ఫ్యాన్స్ ఎంటర్ అయ్యారంటే సీన్ ఇంకోలా ఉంటుంది. పవన్ ప్రతీ బర్త్ దయకి డే కి హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తుంటారు. ఎవ్రీ ఇయర్ వచ్చే బర్త్ డే కే అలా చేస్తే.. మోస్ట్ అవైటెడ్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా విషయంలో ఊరుకుంటారా.

Ustad Bhagath Sing
రీసెంట్ గా రిలీజ్ ఐన గ్లిమ్ప్స్ ను ట్రెండ్ చేసిపడేశారు. అది కూడా నార్మల్ గా కాదు. రిలీజ్ ఐన 18 గంటల్లోనే ఈ గ్లిమ్ప్స్ కు 14 మిలియన్ వ్యూస్ వచ్చాయి. 464 లైక్ లు వచ్చాయి. ఇప్పటికీ ఈ ట్రైలర్ ట్రెండింగ్ లోనే ఉంది. సినిమా గ్లిమ్ప్స్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. చాలా రోజుల తరువాత పవన్ కళ్యాణ్ సిల్వర్ స్క్రీన్ మీద కనిపించడమే ఫ్యాన్స్ కు పెద్ద పండగ అంటే.. అందులోనూ ఈ సినిమాలో పవన్ పోలీస్ గా కనిపించబోతున్నాడు. పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో పదేళ్ల క్రితం గబ్బర్ సింగ్ సినిమా వచ్చింది.
అప్పటి వరకు సంకటంలో ఉన్న పవన్ కెరీర్ ను గబ్బర్ సింగ్ సినిమా మల్లి లైన్లో పెట్టింది. ఆరోజుల్లో గబ్బర్ సింగ్ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు మల్లి వాళ్ళిద్దరి కంబినేషన్లో మల్లి సినిమా రావడం. ఇందులో కూడా పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించడంతో ఈ సినిమా మీద ఫ్యాన్స్ కు భారీగా ఆశలు ఉన్నాయి.. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా రిలీస్ అయ్యాక ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.