Pawan Kalyan: పవన్ కళ్యాణ్ లైఫ్‌లో అలీ లేడా ?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో చనువుగా ఉండే అతి తక్కువ మందిలో కమేడియన్ అలీ ఒకడు. అలీ పవన్ కళ్యాణ్ కలిసి చాలా సినిమాలు చేశారు. పవన్ అంటే తనకు ఎంత ఇష్టమో అలీ చాలా సార్లు చెప్పాడు. అలీ పక్కన ఉంటే తనకు చాలా ధైర్యంగా ఉంటుందని పవన్ కళ్యాణ్ కూడా చాలా సార్లు స్టేజ్ మీదే చెప్పాడు.

Pawan Kalyan Video Comedian Ali Not in that video
పవన్‌కు అంత సన్నిహితుడిగా ఉన్న అలీ ఇప్పుడు పవన్ జీవితంలో లేననట్టు తెలుస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన వపన్ లేటెస్ట్‌గా ఓ వీడియో పోస్ట్ చేశాడు. తన జీవితంలో తాను కలిసిన సింపుల్, టాలెండ్ పర్యన్స్‌ను గుర్తు చేసుకుంటూ వాళ్లతో దిగిన ఫొటోలను వీడియో ఫార్మాట్‌లో షేర్ చేశాడు. పవన్ కళ్యాణ్ మొదటి సినిమా నుంచి మొన్నటి వరకూ తనతో నటించిన చాలా మంది ఆ వీడియోలో ఉన్నారు. హీరోయిన్లు, దర్శకులే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టులను కూడా పవన్ కళ్యాన్ గుర్తు పెట్టుకుని మరీ తన వీడియోలో మెన్షన్ చేశాడు. కానీ ఆ ఫొటోల్లో ఎక్కడా అలీ ఫొటో కనిపించలేదు.
ఇండస్ట్రీలో పవన్‌కు ఎంతో సన్నిహితంగా ఉండే వ్యక్తుల లిస్ట్‌లో ఉండే అలీ ఫొటో లేకపోవడం చాలా మందిని షాక్‌కు గురి చేసింది. దీంతో పవన్ తన జీవితం నుంచి అలీని పూర్తిగా డెలిట్ చేశాడనే అనుమానాలు కలుగుతున్నాయి. సినిమాల్లో మంచి ఫ్రెండ్స్‌గానే ఉన్నా రాజకీయాల పరంగా అలీకి, పవన్‌కు మధ్య అభిప్రాయబేధాలు వచ్చాయి. అప్పట్లో పవన్‌ను కాదని వైసీపీలో చేరిన అలీ పవన్ కళ్యాణ్‌పై నేరుగా విమర్శలు చేశాడు. ఈ ఇన్సిడెంట్ తరువాత పవన్‌కు అలీకి మధ్య గ్యాప్ పెరిగినట్టు తెలుస్తోంది. ఈ కారణంగానే పవన్ తన వీడియోలో అలీ ఫొటోను కూడా పెట్టలేదంటున్నారు. ఎప్పటి నుంచో మంచి ఫ్రెండ్స్‌గా ఉన్న వీళ్లు మళ్లీ కలుస్తారా.. లేక ఈ ఇద్దరిమధ్య గ్యాప్ ఇక అంతేనా అనేది చూడాలి.