Pawan Kalyan Vs Chiranjevi: ఫస్ట్ టైం “మెగా ఫ్యాన్స్” వర్సెస్ “పవర్ స్టార్ ఫ్యాన్స్”..
పవర్ స్టార్ మీద, పవర్ స్టార్ ఫ్యాన్స్ మీద మెగా ఫ్యాన్స్ స్వీట్ వార్నింగ్స్ ఇచ్చే స్టేజ్ నుంచి ఫైర్ అయ్యే వరకు పరిస్థితులు మారుతున్నాయి. కారణం ఒక్కటే పవన్ తనకి తాను కష్టపడి స్టార్ గా ఎదగానని, మొన్నా, తర్వాత నిన్న ఇలా అంటూ ఉండటమే.

Chiru Fans Vs Pawan Fans
దీంతో ఇప్పుడు మెగా ఫ్యాన్స్ పవన్ కి ఏమైంది? ఇలా అన్న చిరునేమరిచిపోతున్నాడనంటున్నారు. పవన్ ఫ్యాన్స్ కూడా డైలామాలో పడ్డారు. కాని సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్, పవన్ ఫ్యాన్స్ మధ్య చిన్న పాటి కామెంట్ల యుద్దం నడుస్తోంది.
పవనే కాదు నాగబాబు, చిరు అంతా కానీస్టేబుల్ కొడుకులే.. పవన్ కాని, నాగబాబు కాని సినీ ప్రపంచానికి చిరు తమ్ములుగానే పరిచయం అయ్యారు. అన్న వేసిన రోడ్డు మీదే నడిచారు. నడుస్తున్నారు. కాకపోతే పవన్ తన నటనతో, చిత్ర విచిత్రమైన ప్రయోగాలతో యూత్ కి దగ్గరై, అన్నను మించిన తమ్ముడనిపించుకున్నాడు.
కాని చిరునే లేకపోతే మెగా హీరోలందరి పరిస్థితేంటి..? ఈ ప్రశ్ని చాలా సార్లు, చెర్రీ, వరుణ్ తేజ్, ఆఖరికి బన్నీ కూడా మెగాస్టార్ వేసిన రోడ్డు మీదే నడిచాం అన్నారు. పవన్ కూడా అన్నయ్య వల్లే తను హీరో అయ్యానని ఒప్పుకున్నాడు. కాని స్టార్ గా ఎదిగింది తన స్వయం కృషితోనే అనటంతో కుటుంబంలా ఉండే మెగా ఫ్యాన్స్, పవన్ ఫ్యాన్స్ మధ్య డిస్టెన్స్ వచ్చినట్టౌతోంది.