PAWAN KALYAN: యంగ్ హీరో మూవీ ఫంక్షన్‌కు గెస్టుగా పవన్..
కాకపోతే పవన్ పేరుని, తన అభిమానిగా పవన్‌ని నితిన్ వాడుకున్నంతగా మరెవరూ వాడుకోలేదంటారు. నిఖిల్ కూడా పవన్‌కి పెద్ద అభిమానే అయినా, ఎన్నడూ పవర్ స్టార్ అభిమానిగా తన ఫేమ్‌ని వాడుకోలేదు. కానీ, నితిన్ తన సినిమాల ఈవెంట్స్‌కి పవన్‌ని గెస్ట్‌గా తీసుకొచ్చాడు.

PAWAN KALYAN: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా బాలేకున్నా బాక్సాఫీస్ షేక్ అవుతుంది. ఇక కంటెంట్ బాగుంటే, బాక్సాఫీస్ బద్దలవ్వాల్సిందే. అంత క్రేజ్, మార్కెట్‌లో మైలేజ్ ఉన్న పవర్ స్టార్‌కి జనాల్లోనే కాదు.. హీరోల్లో కూడా ఫ్యాన్స్ ఎక్కువే. నితిన్, నిఖిల్, కిరణ అబ్బవరం.. ఇలా యంగ్ హీరోల్లో పవన్ ఫాలోవర్స్ ఎక్కువే. కాకపోతే పవన్ పేరుని, తన అభిమానిగా పవన్‌ని నితిన్ వాడుకున్నంతగా మరెవరూ వాడుకోలేదంటారు. నిఖిల్ కూడా పవన్‌కి పెద్ద అభిమానే అయినా, ఎన్నడూ పవర్ స్టార్ అభిమానిగా తన ఫేమ్‌ని వాడుకోలేదు.
కానీ, నితిన్ తన సినిమాల ఈవెంట్స్‌కి పవన్‌ని గెస్ట్‌గా తీసుకొచ్చాడు. తన మూవీల్లో పవన్ సీన్లు, పాటలు వాడుకున్నాడు. పవన్ నామస్మరణతో ఈజీగా తన సినమాలను మార్కెట్ చేసుకున్నాడు. పవన్ అభిమాని అయిన నితిన్ ఎంతగా పవనిజాన్ని వాడుకున్నాడో చెప్పేలా చేసే విషయాలు. వాటి సంగతి అలా ఉంచితే, హిట్లు, పేరు ఉన్నా కొంతకాలంగా సక్సెస్ లేదని బాధపడుతున్న కిరణ్ అబ్బవరం ఈసారి పవన్ నామస్మరణ చేస్తున్నాడు. తన కొత్త మూవీ రూల్స్ రంజన్ ఈవెంట్‌కి పవన్‌ని చీఫ్ గెస్ట్‌గా పిలచాడట. సో.. కిరణ్ కూడా నితిన్ బాటలోనే నడుస్తున్నాడు. అయితే, పవన్ హాజరవుతాడా.. లేదా.. అనే విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.