PAWAN KALYAN: 100 కోట్లు వెనక్కి ఇచ్చేస్తున్న పవర్ స్టార్..?
ఏ హీరో చేయని పని పవన్ చేయబోతున్నాడటంటున్నారు. నిజమే.. హరిహర వీరమల్లు విషయంలో పవన్ నిర్ణయం షాకింగ్‌గానే ఉంది. అందులో నిజం ఎంతోకాని హరి హరవీరమల్లు ప్రాజెక్ట్ ఆగిపోయినట్టే అని తెలుస్తోంది. ఆల్రెడీ దర్శకుడు క్రిష్ ఈ ప్రాజెక్ట్ నుంచి పక్కకు వెళ్లిపోయాడు.

PAWAN KALYAN: పవన్ కళ్యాణ్ వందకోట్ల నష్టాన్ని భర్తీ చేసేందుకు చరిత్రాత్మక నిర్ణయం తీసుకోబోతున్నాడు. ఇది ఇప్పడు ఇండస్ట్రీలో వినిపిస్తున్న కొత్త ప్రచారం. ఏ హీరో చేయని పని పవన్ చేయబోతున్నాడటంటున్నారు. నిజమే.. హరిహర వీరమల్లు విషయంలో పవన్ నిర్ణయం షాకింగ్‌గానే ఉంది. అందులో నిజం ఎంతోకాని హరి హరవీరమల్లు ప్రాజెక్ట్ ఆగిపోయినట్టే అని తెలుస్తోంది. ఆల్రెడీ దర్శకుడు క్రిష్ ఈ ప్రాజెక్ట్ నుంచి పక్కకు వెళ్లిపోయాడు.
Chelsea Islan: ఇండోనేషియా హీరోయిన్‌తో పాటు లిస్ట్‌లో మరొకరు..?
అనుష్క అయితే లేడీ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తోంది. ఐదేళ్లుగా సగం షూటింగ్ పూర్తి చేసుకుని మిగతా సగం పూర్తికాక అటకెక్కింది ఈప్రాజెక్ట్. అలాగని పవన్ కళ్యాణ్ తప్పేమైనా ఉందా అంటే, తను రాజకీయాలతో బిజీ అయ్యాడు. ఏపి ఎలక్షన్స్ తర్వాతే మళ్లీ సినిమాలు చేస్తాడు. చేసినా ముందు ఓజీ పూర్తి చేస్తాడు. ఆతర్వాత హరిహర వీరమల్లు ఉంటుందా అంటే చెప్పలేం అంటున్నారు. ఒక వేళ షూటింగ్ ఉంటే మాత్రం క్రిష్ వెల్లిపోవటంతో ఏఎమ్ రత్రం కొడుకు జ్యోతి కృష్ణ డైరెక్టర్‌గా మిగతా సగం పూర్తి చేస్తాడంటున్నారు. అది జరక్కపోతే, సినిమా ఆగిపోయినట్టే. ప్రజెంట్ హరిహర వీరమల్లు ప్రాజెక్ట్ ఇక పక్కకెళ్లిపోయినట్టే అన్న మాటే వినిపిస్తోంది. అదే నిజమనుకోవటానికి పవన్ ఈ మూవీకి చాలా మొత్తం నిర్మాతకు చెల్లించబోవటమే అంటున్నారు.
ఎవరైనా హీరో ఓ సినిమా ఆగిపోతే అడ్వాన్స్ తిరిగిచ్చేయటం కామన్. కాని పవన్.. హరిహర వీరమల్లు షూటింగ్‌కి ఇప్పటి వరకైన ఖర్చుని వడ్డీతో సహా కలిపి వందకోట్లు ఇవ్వబోతున్నాడట. తన నిర్ణయాల వల్లే హరిహర వీరమల్లు ఐదేళ్లుగా సాగుతూ వచ్చింది. ఆల్‌మోస్ట్ ఆగిపోయింది. అందుకే, నిర్మాత నష్టపోకుండా ఉండేందుకు, అయిన ఖర్చుతోపాటు వడ్డీతో సహా పవన్ చెల్లిస్తాడనేసరికి, అదే జరిగితే చరిత్రలో పవన్ పేరు మారుమోగుతుందంటున్నారు.