PAWAN KALYAN: పవన్ షాకింగ్ నిర్ణయం.. ఎన్నికల తర్వాతే సినిమాలు..
పవన్ సినిమాలు ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతాయా అని ఆయన ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తుంటారు. కానీ అలాంటి ఫ్యాన్స్ అందరికీ పవన్ కళ్యాణ్ షాక్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. ఏపీలో ఎలక్షన్ పూర్తయ్యేవరకూ సినిమా షూటింగ్‌లు ఆపేయబోతున్నాడట.

PAWAN KALYAN: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి సపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. వరుస ఫ్లాపులు వచ్చినా ఇంచ్ కూడా తగ్గని క్రేజ్ ఆయన సొంతం. జస్ట్ పవన్ పేరు స్క్రీన్ మీద కనిపించినా చాలు.. థియేటర్లో విజిల్స్ మోత మోగిపోద్ది. అందుకే పవన్ సినిమాలు ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతాయా అని ఆయన ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తుంటారు. కానీ అలాంటి ఫ్యాన్స్ అందరికీ పవన్ కళ్యాణ్ షాక్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది.
Chiranjeevi: కొత్త లుక్‌తో మెగా కిక్ ఇస్తున్న మెగాస్టార్..!
ఏపీలో ఎలక్షన్ పూర్తయ్యేవరకూ సినిమా షూటింగ్‌లు ఆపేయబోతున్నాడట పవన్ కళ్యాణ్. ప్రస్తుతం ఏపీలో ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పూర్తి స్థాయిలో రాజకీయాల మీద ఫోకస్ పెట్టాలని డిసైడయ్యాడట. ఎలక్షన్ పూర్తైన తరువాతే పెండింగ్ ప్రాజెక్ట్‌లు కంప్లీట్ చేయాలని నిర్ణయించుకున్నాడట. నిజానికి ఎన్నికల కంటే ముందే పెండింగ్ ప్రాజెక్ట్‌లు కంప్లీట్ చేయాలని అనుకున్నాడు పవన్ కళ్యాణ్. కానీ పరిస్థితులు అనుకూలించలేదు. ప్రస్తుతం ఓజీ, హరిహరవీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్. ఈ సినిమాలన్నీ కంప్లీట్ చేసి ఎలక్షన్‌కు వెళ్లాలని అనుకున్నాడు. కానీ పరిస్థితి రివర్స్ అయ్యింది. ఏపీలో రాజకీయ పరిస్థితులు మారిపోయాయి. దీంతో సినిమాలు పక్కన పెట్టి పార్టీ పనుల్లో పవన్ బిజీ అయ్యారు.
ఎన్నికలకు ఇంకా కొన్ని నెలల సమయం మాత్రమే ఉంటడంతో సినిమాలకు బ్రేక్ ఇవ్వబోతున్నారు. దీంతో పవన్ ఫ్యాన్స్ ఫుల్ డిసప్పాయింట్ అయ్యారు. ఎన్నికలు పూర్తయ్యే వరకూ తమ అభిమాన హీరోను స్క్రీన్ మీద చూసే ఛాన్స్ లేదా అంటూ బాధపడుతున్నారు.