Pawan Kalyan: అలీతో సరదాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. క్షమించేశాడా..?
తొలిప్రేమ మూవీ నుంచి మొదలు.. బద్రి, ఖుషి, కాటమరాయుడు వరకు పవన్ మూవీల్లో మెరిసిన అలీ 2018 నుంచి పవన్‌కి దూరంగానే ఉంటున్నాడు. పవన్ జనసేన, అలీ వైసీపీ అవటంతో ఆమధ్య అలీ మీద పవన్, పవర్ స్టార్ మీద అలీ కామెంట్లు చేసుకున్నారు.

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు అలీ ఇండస్ట్రీలో మంచి స్నేహితుడు. అలాంటి తను రాజకీయాల వల్ల పవన్‌కి దూరమయ్యాడు. ఇప్పుడు మళ్లీ దగ్గరవుతున్నాడు. కలిసి నటించబోతున్నాడు. తొలిప్రేమ మూవీ నుంచి మొదలు.. బద్రి, ఖుషి, కాటమరాయుడు వరకు పవన్ మూవీల్లో మెరిసిన అలీ 2018 నుంచి పవన్‌కి దూరంగానే ఉంటున్నాడు.
పవన్ జనసేన, అలీ వైసీపీ అవటంతో ఆమధ్య అలీ మీేంద పవన్, పవర్ స్టార్ మీద అలీ కామెంట్లు చేసుకున్నారు. ఆతర్వాత ఇద్దరి మధ్య గ్యాప్స్ కూడా పెరిగాయి. ఎక్కడ ఒకరిని మరొకరు కించపరుచుకోలేదు కాని, దూరం మాత్రం పెరిగింది. ఐనా పవన్ మీద తనకున్న అభిమానాన్ని అలీ మాట్లల్లో ఎన్నో సార్లు ప్రూవ్ చేశాడు. ఏదేమైనా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఓజీ మూవీలో అలీకి బెర్త్ కన్ఫామ్ అయ్యింది. హరీష్ శంకర్ తీస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్‌లో కూడా అలీకి రోల్ కన్ఫామ్ అంటూ ప్రచారం జరుగుతోంది.
ఏదేమైనా పవన్‌తో అలీ కాంబినేషన్ అంటే.. ఆ సీన్లు కామెడీ గారడి చేస్తాయి. ఫ్యాన్స్‌కి ఈ కాంబో అంటే ఛాలా ఇష్టం. అందుకే పొలిటికల్‌గా ఏం జరిగినా అలీని లైట్ తీసుకుని, మళ్ళీ పవన్ దగ్గరికి తీసుకుంటున్నాడనే చర్చ పెరిగింది. అదే నిజమవుతోంది.