షేక్ అయిన సోషల్ మీడియా, పోలెనా అంజనా ఏం చదువుతోంది…?
సోషల్ మీడియా పొలేనా హ్యాష్ ట్యాగ్ తో షేక్ అవుతోంది. పవన్ కూతురు డిక్లరేషన్ పై సంతకం చేసిందని వచ్చిన వార్తతో చాలా మంది ఆధ్యా అనుకున్నారు. కాని సంతకం చేసింది ఆధ్యా కాదు... పొలేనా అని తెలిసి షాక్ కంగుతిన్నారు జనాలు.
సోషల్ మీడియా పొలేనా హ్యాష్ ట్యాగ్ తో షేక్ అవుతోంది. పవన్ కూతురు డిక్లరేషన్ పై సంతకం చేసిందని వచ్చిన వార్తతో చాలా మంది ఆధ్యా అనుకున్నారు. కాని సంతకం చేసింది ఆధ్యా కాదు… పొలేనా అని తెలిసి షాక్ కంగుతిన్నారు జనాలు. ఈ పేరు కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడూ వినలేదు. పవన్ కు నలుగురు పిల్లలు, అందులో ఇద్దరు ఆడ పిల్లలు అని తెలుసు. కాని సంతకం చేసినప్పుడు బయటకు వచ్చిన ఫోటో చూసి పవన్ కు ఇంత పెద్ద చిన్న కూతురు ఉందా అని ముక్కున వేలేసుకున్నారు.
ఇక అక్కడి నుంచి ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ కూతుళ్ళ గురించే టాపిక్. ఇన్నాళ్ళు పవన్ కళ్యాణ్ పిల్లలు అంటే మీడియాలో కనపడింది అకీరా, ఆధ్యా మాత్రమే. మిగిలిన ఇద్దరు పిల్లలు ఎక్కడ ఉంటారో ఎలా ఉంటారో కూడా కనీసం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు కూడా తెలియదు. అసలు ఇప్పుడు పోలేన ఎక్కడ ఉంటుంది, ఏం చదువుతుంది, ఆమె ఎప్పుడు పుట్టింది వంటి విషయాలతో సోషల్ మీడియాలో హడావుడి చేస్తున్నారు జనాలు. తీన్మార్ సినిమా టైం లోనే పోలేన పుట్టింది. ఆమె అన్నా లేజోనోవా కడుపులో ఉండగానే పవన్, రేణు దేశాయ్ దూరం అయ్యారు.
ఆ తర్వాత పోలేన పుట్టడం, అక్కడి నుంచి పవన్ కళ్యాణ్… అన్నాతో కలిసి ఉండటం జరిగాయి. ఆమె 2011 లో పుట్టగా ప్రస్తుతం ఆమె వయసు 13 ఏళ్ళు. 8వ తరగతి చదువుతోంది అని సమాచారం. ఎక్కువగా రష్యాలోనే పెరిగిన ఆమె… ఇప్పుడు హైదరాబాద్ లోనే ఉంటున్నట్టు టాక్. అన్నా లేజోనోవా తల్లి తండ్రుల వద్ద ఆమెను పెంచాలి అనుకున్నా పవన్ అభ్యంతరం చెప్పడంతో ఆమెను హైదరాబాద్ తీసుకొచ్చేసారు. తల్లి క్రీస్టియన్ కావడంతో పొలేనా తల్లి మతాన్నే స్వీకరించారు. ఇక ఆమెకు తన తల్లి పేరు పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్.
ప్రస్తుతం హైదరాబాద్ లోని ఓ ప్రముఖ స్కూల్ లో చదువుతున్నారు. ఇక పవన్ పెద్ద కుమార్తె పోలికలతోనే ఉండటం పిల్లలు అందరూ కలిసే ఉండటం చూసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పొంగిపోతున్నారు. ఇద్దరు కూతుళ్ళు ట్విన్స్ లా ఉండటం చూసి ఫ్యాన్స్ కూడా షాక్ అవుతున్నారు. ఇద్దరికీ నానమ్మ పోలికలే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక అప్పుడే ఆమె పవన్ కళ్యాణ్ హైట్ ఉన్నారు. కాగా రేణు దేశాయ్ కి విడాకులు ఇచ్చిన తర్వాత 2013లో పవన్ కళ్యాణ్ అన్నా లెజినోవాని వివాహం చేసుకున్నారు. వివాహం తర్వాత వీరికి రెండో సంతానంగా మార్క్ శంకర్ జన్మించిన సంగతి తెలిసిందే.