Pawan Kalyan: బ్రో సినిమాలో..40 కోట్లు పోతే పోయాయి .. పవన్ వల్ల 200 కోట్లొచ్చాయి..

బ్రో మూవీ కోసం పవన్ కళ్యాణ్ 20 రోజులు పని చేశాడు. రోజుకి 2 కోట్ల చొప్పున 20 రోజులకు 40 కోట్లు ఛార్చ్ చేశాడు. ఇది ఆమధ్య వైరలైంద. కోటా శ్రీనివాసరావు లాంటి నటుల నుంచి వ్యతిరేకించే రాజీకీయనాయకుల వరకు అంతా ఈ విషయాన్నే హైలెట్ చేసి విమర్శించటం కూడా జరిగింది. సరే ఓర్వలేని వాళ్లు ఎన్నైనా అంటారనే కౌంటర్లు కూడా వచ్చినా, లేటెస్ట్ గా పవన్ పుణ్యమాని 200 కోట్ల ప్రాఫిట్ పట్టేసింది బ్రో టీం.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: July 12, 2023 | 06:47 PMLast Updated on: Jul 12, 2023 | 6:47 PM

Pawan Kalyans Bro Movie Has Made A Profit Of 200 Crores Said The Film Unit

నిజమే, 40 కోట్లు పవన్ కి సమర్పించారు, కేవలం 20 రోజులకు పవర్ స్టార్ కి అంత సమర్పించటం సమంజసమా అన్నారు. కాని ఏమైంది బ్రో మూవీ ప్రిరిలీజ్ బిజినెస్ తో 200 కోట్లు దక్కాయి. బ్రో మూవీ తెలంగాణ రైట్స్ 30 కోట్లకు సేల్ అయితే ఆంధ్రా రైట్స్ 40 కోట్లు, సీడెడ్ 10 కోట్లకు సేల్ అయ్యాయి. ఇక యూఎస్ రైట్స్ 20 కోట్లు అయితే, శాటిలైట్ రైట్స్ 45 కోట్లు, ఓటీటీ రైట్స్ 55 కోట్లు పలికాయి.

సో కేవళం థియేట్రికల్ రైట్సే 100 కోట్లయితే, నాన్ థియేట్రికల్ రైట్స్ 100 కోట్లని తేలింది. మొత్తానికి పవన్ కి 40 కోట్లు, సాయితేజ్, తోపాటు హీరోయిన్లు, మిగతా బ్యాచ్ కి కలిపి మొత్తంగా మూవీకి పెట్టింది 75 కోట్లు..అవి పోనూ 125 కోట్లు నిర్మాతకి లాభం రూపంలో రిలీజ్ కిముందే దక్కాయి.. ఇది పవన్ కళ్యాణ్ స్టామినా.