Pawan Kalyan: ఏంటి బ్రో ఇది.. అవి వేసుకునే కోట్లా..? దాచుకునే కోట్లా..?

ఓవర్ సీస్‌లో హైప్ లేకపోవడంతో ఎవరూ కొనలేదని, నిర్మాతలే రిలీజ్ చేస్తున్నారన్నారు. కట్ చేస్తే నిర్మాతలే డిస్ట్రిబ్యూటర్లుగా మారి, యూఎస్‌లోని ఎగ్జిబిటర్‌కి అమ్మితే, ఏకంగా రూ.35 కోట్లు వచ్చాయట.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: July 25, 2023 | 09:17 AMLast Updated on: Jul 25, 2023 | 9:17 AM

Pawan Kalyans Bro Movie Overseas Rights Sold For Huge Amount

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్రో రిలీజ్‌కి ముందే రూ.200 కోట్ల బిజినెస్ చేసిందంటేనే షాకైంది ఇండస్ట్రీ. ఓవర్ సీస్‌లో హైప్ లేకపోవడంతో ఎవరూ కొనలేదని, నిర్మాతలే రిలీజ్ చేస్తున్నారన్నారు. కట్ చేస్తే నిర్మాతలే డిస్ట్రిబ్యూటర్లుగా మారి, యూఎస్‌లోని ఎగ్జిబిటర్‌కి అమ్మితే, ఏకంగా రూ.35 కోట్లు వచ్చాయట.

నిజం చెప్పాలంటే తమిళ్ స్టార్ సూర్య చేసిన కంగువా మూవీతో పోలిస్తే బ్రో క్రియేట్ చేసింది సెన్సేషనే. ఎందుకంటే కంగువా 10 భాషల్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ. అయినా అన్ని భాషల తాలూకు ఓవర్ సీస్ రైట్స్ 45 కోట్లు. అదే పవన్ గెస్ట్ రోల్ ప్లే చేసి బ్రో విషయానికొస్తే ఒకే భాషలో రిలీజయ్యే ఈ మూవీ యూఎస్‌లో రిలీజ్‌కి ముందే 35 కోట్లు సొంతం చేసుకోవటం అంటే అది హిస్టరీనే. ఏదేమైనా ఒకప్పుడు ఓవర్ సీస్ మార్కెట్ అంటే హిందీ స్టార్లకే గిరాకీ ఉండేది. సింగ్‌లు, నార్త్ ఇండియన్స్ యూరప్, అమెరికాలో ఎక్కువుండటం వల్ల అలా జరిగేది. కాని 20ఏళ్లుగా యూఎస్, యూరప్‌లో ఐటీ వల్ల సౌత్ ఇండియన్స్ ఎక్కువ సెటిలవుతుండటంతో అలా అక్కడ కూడా సౌత్ మార్కెట్, ముఖ్యంగా తెలుగు మార్కెట్ పెరిగింది.

అలాచూస్తే ఓవర్ సీస్‌లో నిర్మాతలే సొంతంగా రిలీజ్ చేస్తుండటంతో ఎగ్జిబిటర్స్ వల్ల బ్రో మూవీకి రూ.35 కోట్లు వచ్చింది. ఓజి రైట్స్ ముందే సేల్ చేయటం వల్ల రూ.29 కోట్లు వచ్చాయి. నాని హలో నాన్న మూవీ రూ.8 కోట్లకు సేల్ అయితే, రామ్ స్కంద మూవీ రూ.5 కోట్లకు ఓవర్ సీస్ రైట్స్ సేల్ అయ్యాయి. సామజవరగమన లాంటి చిన్న సినిమానే ఓవర్ సీస్‌లో 10 రోజుల్లో వన్ మిలియన్ డాలర్స్, వన్ వీక్‌లో బేబీ లాంటి మూవీ హాఫ్ మిలియన్ డాలర్స్ రాబట్టాయంటే, మన మార్కెట్ అక్కడ ఎలా పెరుగుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.