Renu Desai: ఐష్‌కు రేణు నో.. పవన్ కళ్యాణ్ కోసం ఐశ్వర్య రాయ్‌ని వదిలేసుకున్న రేణు దేశాయ్
రేణులో ఉన్న టాలెంట్‌ని తన సినిమాకు మాత్రమే పరిమితం చేయాలి అనుకోలేదు పవన్ కళ్యాణ్. మిగిలిన సినిమాలకూ వర్క్ చేసుకోమని చెప్పారట. అప్పట్లో రేణూకి ఐశ్వర్యారాయ్ నుంచి పిలుపొచ్చింది. బాలీవుడ్‌లో స్టార్ హీరొయిన్‌గా కొనసాగిన ఐశ్వర్య రాయ్ తన వ్యక్తిగత కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేయమని రేణూని రిక్వెస్ట్ చేసిందట.
Renu Desai: రేణూదేశాయ్.. ఎప్పుడూ ట్రెండింగ్‌లోనే ఉంటుంది. సినిమాలకు బ్రేక్ తీసుకుని ఈ మధ్యే టైగర్ నాగేశ్వరరావు (TIGER NAGESWARA RAO) మూవీతో రీఎంట్రీ ఇచ్చింది. అయితే రీ ఎంట్రీ ఇచ్చినా, లేకపోయినా రేణూదేశాయ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. పిల్లలకు సంబంధించి ఎప్పటికప్పుడు ఇంట్రెస్టింగ్ అప్‌డేట్స్ షేర్ చేస్తూ ట్రెండింగ్‌లో ఉంటుంది. అయితే రేణూ నటిగానే చాలామందికి తెలుసు. కానీ ఆమె సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వక ముందు మోడల్, ఫ్యాషన్ డిజైనర్.
Varun Tej: ఓటీటీలో వరుణ్-లావణ్య పెళ్లి.. అమ్మో.. డీల్ అన్ని కోట్లా..
మోడలింగ్ రంగంలో మంచి ప్రాచుర్యం పొందిన తర్వాత ఆమె డైరెక్టర్ పూరి జగన్నాథ్ దృష్టిలో పడింది. అలా ‘బద్రి’ సినిమాతో కెరీర్ ప్రారంభించిన ఆమె.. ఆ సినిమా సమయంలోనే పవన్ కళ్యాణ్ (PAWAN KALYAN)తో ప్రేమలో పడి పెళ్లి చేసుకుని నటనకు దూరమైంది. బద్రి తర్వాత మళ్లీ పవన్‌తో జానీ మూవీలో నటించింది. పవన్‌తో పెళ్లి తర్వాత నటనకి దూరమైనప్పటికీ తెరవెనుక పనులు చూసుకునేది. జానీ నుంచి కొమరం పులి సినిమా వరకు పవన్ కళ్యాణ్ కాస్ట్యూమ్స్ డిజైన్ చేసింది ఈమెనే. ముఖ్యంగా ఆమె డిజైన్ చేసిన ‘గుడుంబా శంకర్’ మూవీలో డబుల్ ప్యాంట్, బాలులో ప్యాంట్ అప్పట్లో సెన్షేషన్ అయింది. యూత్ మొత్తం ఈ కాస్ట్యూమ్స్‌ని ఓ రేంజ్‌లో ఫాలో అయ్యారు. రేణులో ఉన్న టాలెంట్‌ని తన సినిమాకు మాత్రమే పరిమితం చేయాలి అనుకోలేదు పవన్ కళ్యాణ్. మిగిలిన సినిమాలకూ వర్క్ చేసుకోమని చెప్పారట. అప్పట్లో రేణూకి ఐశ్వర్యారాయ్ నుంచి పిలుపొచ్చింది. బాలీవుడ్‌లో స్టార్ హీరొయిన్‌గా కొనసాగిన ఐశ్వర్య రాయ్ (Aishwarya Rai) తన వ్యక్తిగత కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేయమని రేణూని రిక్వెస్ట్ చేసిందట.
Janhvi Kapoor: ఎన్టీఆర్ కొంప ముంచేస్తున్న బాలీవుడ్ హీరోయిన్..!
కానీ ఆ రిక్వెస్ట్‌ని సున్నితంగా తిరస్కరించానని చెప్పింది రేణు. తాను తన భర్త కోసం మాత్రమే పని చేస్తున్నానని, అక్కడికే సమయం సరిపోతోందని చెప్పేసిందట. అంతగా కావాలంటే ప్రత్యేకంగా సినిమాలకు కాస్ట్యూమ్ డిజైన్స్ చేయడానికి ఎలాంటి ఇబ్బంది లేదు.. కానీ పూర్తిస్థాయిలో వ్యక్తిగత కాస్ట్యూమ్స్ డిజైన్ చెయ్యాలంటే తనవల్ల కాదేనేసింది. ఈ విషయం ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. అయితే రేణూ కేవలం కాస్ట్యూమ్ డిజైన్స్‌లో మాత్రమే కాకుండా దర్శకత్వంలోనూ, నిర్మాణ రంగంలోనూ మంచి పట్టుంది.