Pawan Kalyan: కొత్త జోష్.. కలవరపడొద్దు.. వీరమల్లు 2.0 ఉంది
హరి హర వీరమల్లు సినిమాని పవన్ శ్రేయోభిలాషి, అగ్ర నిర్మాత అయిన ఏఎం రత్నం నిర్మిస్తున్నాడు. తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ గత కొన్ని రోజుల నుంచి హరిహరవీరమల్లు ఆగిపోయిందని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేల్చి చెప్పాడు.

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అప్ కమింగ్ మూవీస్‌లో హరిహర వీరమల్లు కూడా ఒకటి. తన సినీ కెరీర్లో తొలిసారిగా చారిత్రక నేపథ్యం ఉన్న కథలో పవన్ చేస్తుండంతో ఫ్యాన్స్‌లోను, ప్రేక్షకుల్లోను భారీ అంచనాలే ఉన్నాయి. కాగా కొన్ని రోజుల నుంచి హరిహరవీరమల్లు ఆగిపోయిందనే వార్తలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. దీంతో ఫ్యాన్స్‌లో చిన్న కలవరపాటు మొదలయ్యింది. ఈ క్రమంలో ఆ చిత్ర నిర్మాత రంగంలోకి దిగి పూర్తి క్లారిఫై ఇచ్చాడు.
Pawan kalyan: పార్టీ కోసం పవన్ ఆస్తుల అమ్మకం.. డయల్ న్యూస్ కథనాలపై ఫేక్ క్యాంపెయిన్ ..
హరి హర వీరమల్లు సినిమాని పవన్ శ్రేయోభిలాషి, అగ్ర నిర్మాత అయిన ఏఎం రత్నం నిర్మిస్తున్నాడు. తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ గత కొన్ని రోజుల నుంచి హరిహరవీరమల్లు ఆగిపోయిందని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేల్చి చెప్పాడు. ఆంధ్రప్రదేశ్‌లో జరగబోతున్న ఎలక్షన్స్ అనంతరం వీరమల్లు షూటింగ్ ప్రారంభం అవుతుందని కూడా ఆయన చెప్పాడు. దీంతో ఫ్యాన్స్‌లో జోష్ వచ్చినట్టయ్యింది. ఇక ఫ్యాన్స్ ఆనందాన్ని రెట్టింపు చేసేలా సీక్వెల్ కూడా ఉంటుందని రత్నం ప్రకటించాడు. దీంతో వీరమల్లుకి సీక్వెల్ ఉందా లేదా అనే అంశంపై కూడా గత కొన్ని రోజులుగా వస్తున్న విషయాలపై క్లారిటీ వచ్చినట్టయ్యింది.
పాన్ ఇండియా లెవల్లో, అత్యంత భారీ వ్యయంతో నిర్మాణం జరుపుకుంటున్నహరి హర వీరమల్లుకి క్రిష్ దర్శకత్వం వహిస్తుండగా.. కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నాడు. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా చేస్తుండగా, ఇటీవల వచ్చిన యానిమల్‌లో విలన్‌గా మెప్పించిన బాబీ డియోల్ విలన్‌గా చేస్తున్నాడు. సాయి మాధవ్ బుర్రా డైలాగులని అందిస్తున్నాడు.