Pawan Kalyan: పండక్కి 2 సినిమాలు పక్కా.. ఖుషీలో ఫ్యాన్స్..
20 రోజుల గ్యాప్‌లో పవన్ కళ్యాణ్ రెండు సినిమాలు వస్తే ఎలా ఉంటుంది. అదే జరగబోతోంది. ఏపీలో ఎన్నికల వేడి పెరుగుతున్న వేళ.. ఓజీ సమ్మర్‌లో, ఉస్తాద్ భగత్ సింగ్ ఎప్పుడో వస్తాయనుకున్నారు. కాని పవన్ కరుణించాడు.

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి పూనకాలొచ్చే నిర్ణయం తీసుకున్నాడు. ఓజీ మూవీ, ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ కన్ఫామ్ చేశాడు. హరీష్ శంకర్ స్టేట్ మెంట్ నిజం కాబోతోంది. సుజిత్ సినిమా కూడా పండక్కి రాబోతోంది. 20 రోజుల గ్యాప్‌లో పవన్ కళ్యాణ్ రెండు సినిమాలు వస్తే ఎలా ఉంటుంది. అదే జరగబోతోంది. ఏపీలో ఎన్నికల వేడి పెరుగుతున్న వేళ.. ఓజీ సమ్మర్‌లో, ఉస్తాద్ భగత్ సింగ్ ఎప్పుడో వస్తాయనుకున్నారు. కాని పవన్ కరుణించాడు.
కాకపోతే ఒక కండీషన్ పెట్టాడు. 20 రోజులు ఓజీకి, 35 రోజుల కాల్ షీట్స్ ఉస్తాద్ భగత్ సింగ్‌కి కేటాయించాడు. సో ఈ కాల్ షీట్స్‌లోనే ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ అయిపోయేలా, సుజిత్, హరీష్ శంకర్ ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి పవన్ లేని సీన్లు, ఫైట్లు, సాంగ్స్ తీసేసి, ఆ తక్కువ టైంలో షూటింగ్ పూర్తి చేసేలా ప్లాన్ చేసుకుంటున్నారు దర్శకులు. అన్నీ అనుకున్నట్టు జరిగితే క్రిస్మస్‌కి రెండు రోజులు ముందు అంటే డిసెంబర్ 23 న ఓజీ, సంక్రాతికి ఉస్తాద్ భగత్ సింగ్ రావటం కన్ఫామ్ అయ్యింది. గుసగుసలు నిజమయ్యే పరిస్థితి వచ్చింది.