Pawan Kalyan: ఇండిపెండెన్స్ డేకు OG ఫస్ట్ లుక్..!
ఆగస్ట్ 15 ఇండిపెండెన్స్ డే స్పెషల్‌గా ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని వదలబోతున్నారు. అది కూడా ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్‌స్టరా..? లేదంటే మరోకటా అనేది వివరిస్తూ మోషన్ పోస్టర్‌లో చూపించబోతున్నారు.

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ అప్ డేట్లు రెండు రెడీ అయ్యాయి. ఒకటి ఫస్ట్ లుక్ పోస్టర్, మరొకటి ఈ సినిమా గ్లింప్స్. ఈ రెండీంటిని రెడీ చేస్తూ బిజీ అయ్యాడు డైరక్టర్ సుజిత్. ఈవారమే పవన్ కూడా గ్లింప్స్ కోసం స్పెషల్‌గా డబ్బింగ్ చెప్పబోతున్నాడట. ఆగస్ట్ 15 ఇండిపెండెన్స్ డే స్పెషల్‌గా ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని వదలబోతున్నారు. అది కూడా ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్‌స్టరా..? లేదంటే మరోకటా అనేది వివరిస్తూ మోషన్ పోస్టర్‌లో చూపించబోతున్నారు.
ఆల్రెడీ మోషన్ పోస్టర్, ఓజీ గ్లింప్స్ ఎడిట్ అయ్యి రెడీగా ఉన్నాయని తెలుస్తోంది. ఇక పవన్ వచ్చి గ్లింప్స్‌లో తన పాత్ర తాలూకు డైలాగ్స్‌కి డబ్బింగ్ చెబితే సరిపోతుందట. ఈ సండే గ్లింప్స్‌కి పవన్ డబ్బింగ్ చెప్పబోతున్నాడు. సోమవారం థమన్ ఆర్ఆర్ పూర్తి చేస్తారు. మంగళవారం రాత్రి ఓజీ ఫస్ట్ లుక్ గ్లింప్స్‌ని రిలీజ్ చేస్తారట. మొత్తం షెడ్యూల్ ఫిక్స్ అయ్యిందని తెలుస్తోంది. దీంతో పవన్ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు.