PAWAN KALYAN: ఓజీ రిలీజ్ డేట్ కన్ఫాం.. మరోసారి రికార్డులు ఖాయమా..?
ఈ చిత్ర విడుదల తేదీని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. వచ్చే సెప్టెంబర్ 27న సినిమా రిలీజ్ కానున్నట్లు వెల్లడించింది. దీనికి సంబంధించి పవన్ కొత్త ఫొటోను కూడా చిత్ర బృందం విడుదల చేసింది.

PAWAN KALYAN: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ఓజీ. సుజీత్ దర్శకత్వంలో డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పవన్ నటిస్తున్న చిత్రాల్లో ఓజీపైనే ఫ్యాన్స్ ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు. పవన్‌కు పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చిపెడుతుందని, కచ్చితంగా హిట్ అవుతుందని భావిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర విడుదల తేదీని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. వచ్చే సెప్టెంబర్ 27న సినిమా రిలీజ్ కానున్నట్లు వెల్లడించింది.
ALLU ARJUN: ఐకాన్ స్టార్ కోసం రంగంలోకి దిగుతున్న ప్రభాస్ హీరోయిన్
దీనికి సంబంధించి పవన్ కొత్త ఫొటోను కూడా చిత్ర బృందం విడుదల చేసింది. చేతిలో టీ గ్లాసుతో, స్టైలిష్ లుక్కులో పవన్ కనిపిస్తున్నారు. ఈ లుక్ ఇప్పుడు ఫ్యాన్స్‌కు కిక్ ఇస్తోంది. మరోవైపు చిత్ర విడుదల తేదీపై కూడా ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు. కారణం.. ఇదే తేదీన పదకొండేళ్ల క్రితం పవన్ నటించిన అత్తారింటికి దారేది చిత్రం విడుదలైంది. 2013, సెప్టెంబర్ 27న విడుదలైన అత్తారింటికి దారేది.. అప్పట్లో కొత్త రికార్డులు సృష్టించింది. పవన్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు అదే తేదీన ఓజీ విడుదలవుతుండటంతో ఈ సినిమా కూడా రికార్డులు నెలకొల్పుతుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. ఓజీ షూటింగ్ ఇప్పటికే 70 శాతం పూర్తైంది. అయితే, పవన్ రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల షూటింగ్‌కు బ్రేక్ పడింది. మే నెలలో ఎన్నికలు పూర్తవుతాయి.
ఆ వెంటనే పవన్.. ఓజీ షూటింగ్‌కు హాజరవుతాడని తెలుస్తోంది. దీనికి అనుగుణంగా నిర్మాణ సంస్థ షూటింగ్ షెడ్యూల్స్ ప్లాన్ చేసింది. మే నుంచి రెగ్యులర్ షూటింగ్ చేసి, సెప్టెంబర్‌లో విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ చిత్రంలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఎమ్రాన్ హష్మి విలన్‌గా కనిపించబోతున్నాడు. వెంకట్, శ్రియా రెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్నారు. థమన్ సంగీత దర్శకుడు.
The #OG will arrive on 27th September 2024. #TheyCallHimOG #OGonSept27th pic.twitter.com/4PZTUZe2db
— DVV Entertainment (@DVVMovies) February 6, 2024