PAWAN KALYAN: ఓజీ కథ లీక్.. పవన్ ఫ్యాన్స్‌కు పండుగే!

టైటిల్ ఓజినే అయినా.. ఓజి అంటే ఓజాస్ గంభీర అని తెలుస్తోంది. ఓజీ టీజర్‌ ఇచ్చిన హైప్‌తోనే పోయేలా ఉన్నామంటున్నారు పవన్ ఫ్యాన్స్. ఇక ఇప్పుడు లీక్ అయిన స్టోరీ చూస్తే.. తట్టుకోవడం కష్టమే అంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓజీ స్టోరీ లీక్ అయిందనే న్యూస్ వైరల్‌గా మారింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 1, 2023 | 05:51 PMLast Updated on: Nov 01, 2023 | 5:51 PM

Pawan Kalyans Og Story Leaked Here Is The Details

PAWAN KALYAN: ఓజి (OG) అంటే ఒరిజనల్ గ్యాంగ్‌స్టర్ అనే విషయం అందరికీ తెలిసిందే. అది కూడా ముంబైని గడగడలాడించిన ఓజి అయితే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. పైగా ఆ ఒరిజినల్ గ్యాంగ్‌స్టార్‌గా పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ (PAWAN KALYAN) అయితే.. పవర్‌స్టార్ ఫ్యాన్స్ చేసే రచ్చ మామూలుగా ఉండదు. ఇప్పటికే రిలీజ్ అయిన ఓజి టీజర్ అంచనాలను పీక్స్‌కు తీసుకెళ్లిపోయింది. ‘దే కాల్ హిమ్ ఓజి’ టైటిల్‌తో వచ్చిన టీజర్‌లో పవన్‌కు ఇచ్చిన ఎలివేషన్ మామూలుగా లేదు.

అయితే, టైటిల్ ఓజినే అయినా.. ఓజి అంటే ఓజాస్ గంభీర అని తెలుస్తోంది. ఓజీ టీజర్‌ ఇచ్చిన హైప్‌తోనే పోయేలా ఉన్నామంటున్నారు పవన్ ఫ్యాన్స్. ఇక ఇప్పుడు లీక్ అయిన స్టోరీ చూస్తే.. తట్టుకోవడం కష్టమే అంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓజీ స్టోరీ లీక్ అయిందనే న్యూస్ వైరల్‌గా మారింది. ఓజాస్ గంభీరా అనే కామన్ మ్యాన్ ముంబైకి టూరిస్టుగా వస్తాడు. కొన్ని అనుకొని పరిస్థితుల్లో గ్యాంగ్‍స్టర్‍గా మారతాడు. ముంబైని ఊచకోత కోసి తనకంటూ ఓ మాఫియా సామ్రజ్యాన్ని స్థాపించుకుంటాడు. ఈ ప్రయాణంలో అతను తన కుటుంబాన్ని సైతం కోల్పోతాడు. అందుకు కారణమైన వారిపై ప్రతికారం తీర్చుకోవాలనుకుంటాడు. అలాగే డ్రగ్ మాఫియాను పూర్తిగా నాశనం చేయాలనుకుంటాడు’ అనేదే ఓజి కథ అని తెలుస్తోంది. దీంతో ఓజి స్టోరీ లీక్ అనే న్యూస్ వైరల్‌గా మారింది.

ఇక ఈ స్టోరీకి తగ్గట్టే.. ఒక పవర్ స్టార్ అభిమానిగా ఓజిని ఊహకందని విధంగా తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు సుజీత్. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ.. ఓజి మేకింగ్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవడం లేదు. ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్‌‌లో రిలీజ్ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. టీజర్‌తో ఈ మూవీ కంప్లీట్ బ్లడ్ బాత్ అని చర్చించుకుంటున్నారు. ఇక థియేటర్లో ఈ సినిమాకు సరికొత్త రికార్డులు క్రియేట్ అవుతాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి ఇంత భారీ హైప్ క్రియేట్ చేస్తున్న ఓజి ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.