PAWAN KALYAN: OG సెన్సేషన్.. ఏకంగా అన్ని భాషల్లో రిలీజ్.. మరో ఖుషి అవుతుందా..?
అప్పట్లో తొలిప్రేమతో యూత్ మతిపోగొట్టిన పవన్, బద్రిలో తన యాటిట్యూడ్‌తో ఫ్యాన్స్‌లో పూనకాలు తెచ్చాడు. తర్వాత ఖుషీతో ట్రెండ్ సెట్ చేశాడు. రెండు దశాబ్దాలపైనే సినీ జర్నీ చేసిన పవన్.. తన కెరీర్‌లో కొన్నే హిట్లు సొంతం చేసుకున్నాడు.

OG is also one of the upcoming movies of Power Star Pawan Kalyan. Hungry Cheetah is a small teaser from Ozzy as Pawan's birthday gift
PAWAN KALYAN: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తొలిప్రేమ వచ్చిన కొత్తలో ఆ సినిమా చూసి, అందులో పవన్ పాత్ర, తన పెర్పామెన్స్ కి ఫిదా అయిన బ్యాచే తనకి హార్డ్ కోర్ ఫ్యాన్స్‌గా మారారు. వాళ్లిప్పుడు 40 ప్లస్ అయ్యుండొచ్చు. కాని వాళ్లు, వాళ్ల పిల్లలు, ఇంకా చెప్పాలంటే ఈ తరానికి చెందిన యూత్.. ఇలా అంతా పవన్ మీద అంత పిచ్చిగా అభిమానం చూపించటానికి కారణం.. ఏ హీరో చేయని చాలా చిత్ర విచిత్రమైన పనులు పవన్ చేయటం, అది యూత్‌కు నచ్చటమే. అప్పట్లో తొలిప్రేమతో యూత్ మతిపోగొట్టిన పవన్, బద్రిలో తన యాటిట్యూడ్‌తో ఫ్యాన్స్‌లో పూనకాలు తెచ్చాడు.
తర్వాత ఖుషీతో ట్రెండ్ సెట్ చేశాడు. రెండు దశాబ్దాలపైనే సినీ జర్నీ చేసిన పవన్.. తన కెరీర్‌లో కొన్నే హిట్లు సొంతం చేసుకున్నాడు. కాని ఏ హీరోకి దక్కనంతగా వెర్రెక్కిపోయేంత అభిమానులు తన సొంతం. దీనంతటికి తొలిప్రేమ, బద్రి, ఖుషీ లాంటి హిట్లు తనకి పడటమే. మధ్యలో ప్యాంట్ మీద ప్యాంట్, బాలులో విచిత్రమైన ప్యాంట్, తమ్ముడులో మార్షల్ ఆర్ట్స్‌కు తోడు ఆ కాలేజ్ సీన్లు జనాలకు తెగ నచ్చాయి. ఇలాంటివి పవన్ మూవీల్లో మాత్రమే కనిపిస్తాయి. అందుకే ఆకాలం యూత్‌తోపాటు ఈ తరం యూత్ కూడా తనకి ఫిదా అయ్యారు. ఐతే తొలిప్రేమ, బద్రి, ఖుషీ లాంటి మూవీలు ఇంతవరకు పవన్‌కి మళ్లీ పడలేదు. జల్సా, అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్, భీమ్లానాయక్ లాంటి హిట్లు పడొచ్చు కాని, అన్నింట్లో తొలిప్రేమ, ఖుషీ, బద్రి లాంటివి వెరీ వెరీ స్పెషల్. ఎందుకంటే, ఇవి పవన్ మీద అభిమానానికి కొలమానాలుగా మారిన మూవీలు. అలాంటిదే ఓజీతో ఇప్పుడు సాధ్యమయ్యేలా ఉంది.
18 భాషల్లో ఈ సినిమా రాబోతుంది. ముఖ్యంగా బెంగాల్, అస్సాం, సిక్కింలో పవన్‌కి ఉన్న హార్డ్ కోర్ ఫ్యాన్స్ కోసం ఆయా భాషల్లో కూడా సినిమాను వదులుతున్నాడు సుజీత్. మరాఠీలో ఫస్ట్ టైం ఓ తెలుగు మూవీ దుమ్ముదులిపేలా ఉంది. ఓజీలో పవన్ మరాఠీగానే కనిపించబోతున్నాడు. అండర్ కవర్ కాప్‌ని చూశాం కాని, అండర్ కవర్ గ్యాంగ్‌స్టర్‌గా పవన్ సరికొత్త రోల్ ప్లే చేయబోతున్నాడు. అందుకే ఇది ట్రెండ్ బెండ్ తీసిన పవన్ సినిమాల లిస్ట్‌లో చేరేలా ఉంది. రిలీజ్ అయ్యాకే అసలు సంగతి తేలబోతోంది.