Pawan Kalyan: ఒక పవర్ స్టార్.. రెండు ఉంగరాలు.. ఇన్ సైడ్ స్టోరీ..
కొంతమంది జ్యోతిష్య పండితుల సూచన మేరకు పవన్ కళ్యాణ్ కూర్మావతార (తాబేలు) అంగుళీకం, నాగబంధం అంగుళీకం అనే పేరు కలిగిన ఉంగరాలను ధరించారట. మంగళవారం, శనివారం నాడు పవన్ కళ్యాణ్ ఈ ఉంగురాలను పెట్టుకుంటున్నారట.
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఏ కొత్త విషయం బయటికొచ్చినా ఆయన ఫ్యాన్స్ సీరియస్‌గా ఫాలో అవుతుంటారు. దాని గురించి లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటారు. తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఉన్న ఒక బలమైన సెంటిమెంట్‌పై ఫ్యాన్స్ మధ్య హాట్ హాట్ చర్చ సాగుతోంది. రాజమండ్రి సెంట్రల్ జైలులో తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి వచ్చిన తర్వాత బాలకృష్ణ, లోకేష్‌లతో కలిసి పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. ఆ సందర్భంగానే అందరి దృష్టి పవన్ కళ్యాణ్ చేతికున్న ఉంగరాలపై పడింది. ఎన్నడూ లేనిది ఇప్పుడు ఆ ఉంగరాలను పవన్ కళ్యాణ్ ఎందుకు ధరించారు..? కారణమేంటి..? అనే దానిపై రకరకాల ఊహాగానాలు వెలువడుతున్నాయి. విభిన్న వార్తలు వస్తున్నాయి.
ఆ రెండు ఉంగరాల పవర్ తెలుసా..?
కొంతమంది జ్యోతిష్య పండితుల సూచన మేరకు పవన్ కళ్యాణ్ కూర్మావతార (తాబేలు) అంగుళీకం, నాగబంధం అంగుళీకం అనే పేరు కలిగిన ఉంగరాలను ధరించారట. మంగళవారం, శనివారం నాడు పవన్ కళ్యాణ్ ఈ ఉంగురాలను పెట్టుకుంటున్నారట. కూర్మ ఉంగరం పెట్టుకుంటే ధన యోగం, అధికార యోగం వస్తాయని అంటున్నారు. నాగ ఉంగరం పెట్టుకుంటే అపమృత్యువు దోషాలు, రాహు, కేతు దోషాలు, నరదిష్టి దోషాలు తొలగిపోతాయని చెబుతున్నారు. దుష్టశక్తులు మనపై పడకుండా చేసే పవర్ నాగ ఉంగరానికి ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. గత ఎన్నికల టైంలో పవన్ కళ్యాణ్ కరెంట్ షాక్ సహా కొన్ని గండాల నుంచి కొంచెంలో బయటపడ్డారు. ఈ నేపథ్యంలో జ్యోతిష్య పండితుల సలహా మేరకు జనసేనాని ఈ ఉంగరాలను ధరించినట్టు తెలుస్తోంది. ఏదిఏమైనప్పటికీ చేతివేళ్లకు పవన్ పెట్టుకున్న ఉంగరాలు అట్రాక్టివ్‌గా ఉన్నాయి. పవన్ గ్లామర్‌ను ఆ రెండు ఉంగరాలు మరింత పెంచాయని ఫ్యాన్స్ అంటున్నారు. అయితే, ఎవరుపడితే వాళ్లు నాగ బంధం ఉంగరాలను ధరించకూడదని.. జోతిష్యం ఆధారంగానే ధరించాల్సి ఉంటుందని పండితులు సూచిస్తున్నారు.
బాలకృష్ణ, మోహన్ బాబు, వెంకటేశ్..
ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా జ్యోతిష్యం, హస్తవాస్తును బాగా నమ్ముతారట. రాహుకాలం, వర్జ్య కాలం చూడనిదే ఆయన కాలు బయటపెట్టరని అంటారు. హీరో విక్టరీ వెంకటేష్ కూడా వివేకానంద ఆధ్యాత్మిక వైఖరిని అనుసరిస్తారు. మాజీ రాజ్యసభ సభ్యుడు మోహన్ బాబు నిత్యం సాయి నామస్మరణలో ఉంటారు. ఎన్టీఆర్ హయాం నుంచే చంద్రబాబు ఒకే దుస్తులను ధరిస్తూ ఉంటారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఖాకీ రంగు ప్యాంట్, తెలుపు రంగు చొక్కాను ధరిస్తారు. సీఎం అయిన తర్వాత కూడా ఆయన ఈ దుస్తులు ధరించడం ఆపలేదు. అది జగన్‌కు సెంటిమెంట్‌గా మారిపోయింది.