PAWAN KALYAN: పవర్ స్టార్ కొడుకే యానిమల్ 2.. సోషల్ మీడియలో చర్చ..
ఈమూవీలో తండ్రి మీద అమితమైన ప్రేమ ఉన్న కొడుకు అంశం, ఇప్పడు అఖిరాకు అప్లై చేస్తున్నారు అభిమానులు. అఖీరా చిన్న తనంలోనే తల్లిదండ్రులు రేణుదేశాయ్, పవన్ విడిపోయారు. అలాంటి పరిస్థితి ఏ పేరంట్స్‌కి వచ్చినా పిల్లల్లో ఉండే అభద్రతా భావం ఎలా ఉంటుందో ఊహించొచ్చు.

PAWAN KALYAN: పవన్ కళ్యాణ్ కొడుకు అఖీరా నందన్.. యానిమల్ సీక్వెల్‌లో హీరో అనటం చూస్తే నిజంగానే సినిమాల్లోకి వస్తున్నాడా అన్న అనుమానాలు రాక తప్పదు. కాని తనని యానిమల్ 2లో హీరో అనటానికి ఇక్కడ కారణం వేరే ఉంది. తను నిజంగానే యానిమల్ సీక్వెల్‌లో నటించకపోయినా.. అసలైన పవర్ ఫుల్ యానిమల్ తనే అనేస్తున్నారు ఫ్యాన్స్.
PAWAN KALYAN: పవన్ పాట పాడితే.. పవర్ ఫుల్ కిక్కే..
అంటే తను వెళ్లి విలన్లను షూట్ చేయటం, లేదంటే రణ్‌బీర్ కపూర్‌లా ప్రవర్తించటం చేస్తాడని కాదు.. ఈమూవీలో తండ్రి మీద అమితమైన ప్రేమ ఉన్న కొడుకు అంశం, ఇప్పడు అఖిరాకు అప్లై చేస్తున్నారు అభిమానులు. అఖీరా చిన్న తనంలోనే తల్లిదండ్రులు రేణుదేశాయ్, పవన్ విడిపోయారు. అలాంటి పరిస్థితి ఏ పేరంట్స్‌కి వచ్చినా పిల్లల్లో ఉండే అభద్రతా భావం ఎలా ఉంటుందో ఊహించొచ్చు. ఐనా పవన్ ఎప్పుడూ తన పిల్లలకి దూరంగా లేడు. కాని అఖిరా ఇప్పుడు యానిమల్ మూవీలో నాన్నా నువు నా ప్రాణం పాటను పియానోతో ప్లే చేయటం హాట్ టాపిక్ అయ్యింది. అసలే అఖీరా, తన చెల్లి ఆద్య విషయాల్లో మెగా ఫ్యామిలీ పాత్ర తక్కువ. అప్పుడప్పుడు వాళ్లే మెగా కాంపౌండ్‌లో కొన్ని ఫంక్షన్స్‌కి అటెండ్ అవుతుంటాడు.
అది కాకుండా అఖీరా మహారాష్ట్రలో ఉన్నప్పుడు పవన్ తప్ప మరెవరు తనని కలిసినట్టు కాని, తన దగ్గరికి వెళ్లినట్టు గాని వార్తలు రాలేదు. ఏదేమైనా అఖీరా, పవన్‌ల మధ్య రిలేషన్ యానిమల్‌లా మరీ అలా లేదు. కానీ, తండ్రి కోసం అఖీరా ఎంత తపన పడుతున్నాడో అనుకునేలా తను యానిమల్ పాట పాడటంతో, పవర్ ఫుల్ యానిమల్ ఎమోషన్ అంటూ ఇదో అంశం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది.