Pawan OG: కాకినాడలో పవన్ ఓజీ షూటింగ్

కాకినాడ పోర్ట్ లో ముంబై పోర్ట్అనేలా సెట్ వేసి, ముంబై పోర్ట్ లోలా కాస్త బ్లాక్ కలర్ యాంబియన్స్ పెంచి భారీగా యాక్షన్ సీన్స్ తీయబోతున్నారట. 1000 మంది ఫైటర్స్ తో బ్లాస్టింగ్స్ సీన్స్ ని తీసి, క్లైమాక్స్ ని పూర్తి చేసే పనిలో ఉందట ఫిల్మ్ టీం.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 23, 2023 | 06:24 PMLast Updated on: Sep 23, 2023 | 6:24 PM

Pawan Og Movie Scheduled To Shoot At Kakinada Port

సుజీత్ మేకింగ్ లో పవన్ చేస్తున్న ఓజీ షూటింగ్ 70 శాతం పూర్తైంది. పవన్ లేని సీన్లన్నీ పూర్తిచేసిన సుజీత్, ఇక పవన్ చేయాల్సిన సీన్లను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ తో బిజీ అయిన పవన్, సడన్ గా కాకినాడలో ప్రత్యక్షం కానున్నాడు.

అక్టోబర్ 27 నుంచి కాకినాడలో ఓజీ సినిమా షెడ్యూల్ ప్లాన్ చేశారట. అదే ఆఖరి షెడ్యూల్ అని తెలుస్తోంది. కాకినాడ పోర్ట్ లో భారీ యాక్షన్ సీన్ ని 15 రోజులు తెరకెక్కిస్తారని కూడా సమాచారం అందుతోంది. నిజానికి ముంబై పోర్ట్ లో ఈ యాక్షన్ ఎపిసోడ్ ప్లాన్ చేస్తే పర్మీషన్ రాలేదట.

కారణం ఇండియన్ మిలిటరీ తాలూకు మెటీరియల్ ముంబై పోర్ట్ లో ఉండటంతో, మరో మూడు నెలల వరకు ముంబై పోర్ట్ ని సినిమా షూటింగ్స్ కోసం ముఖ్యంగా బ్లాస్టింగ్ సీన్ల లాంటివి తెరకెక్కించేందుకు పర్మీషన్ ఇచ్చే పరిస్తితి లేదు. అందుకే కాకినాడ పోర్ట్ లో ముంబై పోర్ట్అనేలా సెట్ వేసి, ముంబై పోర్ట్ లోలా కాస్త బ్లాక్ కలర్ యాంబియన్స్ పెంచి భారీగా యాక్షన్ సీన్స్ తీయబోతున్నారట. 1000 మంది ఫైటర్స్ తో బ్లాస్టింగ్స్ సీన్స్ ని తీసి, క్లైమాక్స్ ని పూర్తి చేసే పనిలో ఉందట ఫిల్మ్ టీం.