పవన్ కి తనకి పోలికా… తమిళ తంబీలు ఓవరాక్షన్.. పొలిటికల్ వార్…!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే ఏపీకి డిప్యూటీ సీఎం అయ్యాడో, అప్పటి నుంచి ఆల్ మోస్ట్ లోప్రొఫైల్ మేయింటేన్ చేస్తున్నాడు. భక్తి ప్రయాణాలు పెంచాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 1, 2025 | 09:04 PMLast Updated on: Mar 01, 2025 | 9:04 PM

Pawans Comparison To Himself Tamil Thambilu Overaction Political War

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే ఏపీకి డిప్యూటీ సీఎం అయ్యాడో, అప్పటి నుంచి ఆల్ మోస్ట్ లోప్రొఫైల్ మేయింటేన్ చేస్తున్నాడు. భక్తి ప్రయాణాలు పెంచాడు. ఇలాంటి టైంలో పవన్ ఫ్యాన్స్ నోటికి, ఫోన్లకు పనిచెప్పాల్సి వచ్చింది. కారణం అరవ స్టార్ దళపతి విజయ్ ఫ్యాన్సే కారనం. పవన్ తో పోలిస్తే తమ హీరోకి ఎలాంటి కన్ ఫ్యూజన్ లేదంటున్నారు. పవన్ ఎటు వెళుతున్నాడో తనకైనా తెలుసా అంటూ కామెంట్లు పేలుస్తున్నారు. మారి ఇది పొలిటికల్ రైవల్స్ లేదంటే పవర్ స్టార్ యాంటి ఫ్యాన్స్ పని కూడా అయ్యుండొచ్చు. కాని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ సనాతన ధర్మం కాపాడే పనిపెట్టుకుంటే, యాంటీ బీజీపీ స్లోగన్ తీసుకుని విజయ్ అరవ అడ్డాలో కామెంట్ల బాంబులు పేలుస్తున్నాడు. ఇలాంటి టైంలో సినిమాల పరంగా పవన్ కళ్యాణ్ కి క్లారిటీ లేదని, తమ అభిమాన నాయకుడు విజయ్ మాత్రం ప్రజాసేవకోసం సినిమాలొదిలేశాడని కామెంట్లు పెట్టడం మొదలు పెట్టారు. ఇది పవన్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ ఫ్యాన్స్ అనేంతవరకు సోషల్ మీడియాలో వార్ షురూ అయ్యింది. ఇంతకి ఆ కామెంట్ల వెనకున్న నిజాలేంటి? టేకేలుక్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల జోరు తగ్గింది. కమిటైన హరి హర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ సినిమాల పెండింగ్ షూటింగ్ అలానే ఉంది. తన ఫ్యాన్స్ కూడా ఒకప్పటిలా సోషల్ మీడియాలో అగ్రెసివ్ గా కూడా కనిపించట్లేదు. ఇలాంటి టైంలో ఉత్తపుణ్యానికి పవర్ ఫుల్ ఫ్యాన్స్ అనే తేనె తుట్టెని తమిళ తంబీలు కదిపారు.అరవ స్టార్ విజయ్ దళపతి కూడా రీసెంట్ గా పాలిటిక్స్ లోకి వచ్చాడు. వస్తూ వస్తూనే తన జన నాగగన్ అంటూ సినిమాకు కమిటై, అదే తన చివరి మూవీ అన్నాడు. అంతే అదేదో పూనకాలొచ్చినట్టు విజయ్ ఫ్యాన్స్ సడన్ గా పవన్ కళ్యాణ్ మీద విరుచుకుపడుతున్నారు. తమిళ నాడులో ఉంది డీఎంకే ప్రభుత్వం.. ఆ పార్టీకి విజయ్ సపోర్ట్ చేస్తూ, బీజేపీ హిందీ భాషా వివాదం మీద ఫైర్ అవుతున్నాడు.

సో ఇక్కడే పవన్ వర్సెస్ విజయ్ గా సీన్ మారింది. పవన్ సనాతన ధర్మం కోసం ఫైట్ చేస్తున్నాడు. బీజేపీతో అలియన్స్ తో ఉన్నాడు. విజయ్ బీజేపీకి యాంటీగా స్లోగన్ తీసుకున్నాడు. సో ఇదంతా పొలిటికల్ పాలసీస్ సంబంధించిన వ్యవహరాం..దీనికి సినిమాలకు ఎలాంటి సంబంధంలేదు. కాని అరవ స్టార్ విజయ్ ఫ్యాన్స్ మాత్రం పవన్ సినిమాల మీద ట్రోలింగ్ షురూ చేశారు.పవన్ కళ్యాణ్ కి క్లారిటీ లేదని, కాసేపు సినిమాలు మానేస్తానంటాడు. మళ్లీ పార్టీ నడపాలంటే డబ్బులు కావాలని, అందుకోసం సినిమా చేస్తానంటాడు..కాని తమ స్టార్ మాత్రం జన నాయగన్ తో సినిమాలాపేసి,పూర్తిగా ప్రజాసేవకే కమిటవుతున్నాడని వెక్కిరిస్తున్నారు. ఐతే రంగంలోకి దిగిన పవన్ ఫ్యాన్స్ నుంచి కూడా కౌంటర్ ఎటాక్ మామూలుగా లేదు.

పవన్ హిట్ సినిమాలన్నీ లిస్ట్ తీసి, వాటిని రీమేక్ చేసిన గట్టెక్కిన స్టార్ విజయ్ అనేశారు. విజయ్ కెరీర్ లో 60 శాతం హిట్లన్నీ పవన్ కళ్యాణ్ హిట్ మూవీల రీమేక్సే అని తేల్చారు. ఇక మిగతా 40శాతం హిట్స్ లో కూడా 35 శాతం హిట్లు మిగతా తెలుగు హీరోల హిట్స్ మూవీల రీమేకులే.. ఇదే విషయాన్ని సినిమా పోస్టర్లతో సహా పోల్చి చూపిస్తున్నారు.సో పవన్ హిట్ మూవీలనే కాదు, పొలిటికల్ జర్నీని కూడా విజయ్ కాపీ కొడుతున్నారనే అన్నారు. పవన్ ఎలా అయితే ముందు సినిమాలకు బ్రేక్ వేసి పాలిటిక్స్ లో బిజీ అయ్యాడో, తర్వాత పొలిటికల్ గా ప్రజాసేవ చేస్తూనే అటే ఉండిపోయాడు. కాని ఎలక్షన్స్ కి ముందు వరకు తను సగం షూటింగ్ చేసి ఆపిన మూవీలే ఇప్పుడు చేస్తూన్నాడు తప్ప, కొత్త కమిట్మెంట్స్ ఇవ్వలేదు. కాబట్టి క్లారిటీ లేంది తమిళ విజయ్ కో తెలుగు పవర్ స్టార్ కో చెక్ చేసుకోమంటూ సాలిడ్ గానే ట్రోలింగ్స్ తో కౌంటర్ ఎటాక్ చేస్తోంది పవర్ స్టార్ ఫ్యాన్స్ బ్యాచ్.