Trivikram: బ్రో మెడకి చుట్టుకుంది.. చుక్కలే
త్రివిక్రమ్ పాపం పండింది.. అందుకే వరుసగా తనకి పంచ్ లు పడుతున్నాయి. ఇక మిగిలింది కర్మఫలితమే అంటూ సోషల్ మీడియాలో పోస్టులు రెస్ట్ లేకుండాపెట్టేస్తున్నారు. దీంతో పవన్ కెరీర్ కొల్లాప్స్ చేస్తున్నాడని భావించే ఫ్యాన్సు ఒకవైపు.. లేదు లేదు పవన్ కి పరోక్షంగా సాయం చేస్తున్నాడంటు మరో వర్గం అభిమానులు ఇలా రెండుగా చీలిపోయారని టాక్ నడుస్తోంది.

Pawan's fans are angry on social media that it was Trivikram who spoke political dialogues with Pawan in Bro movie
ఆ సంగతి అటుంచితే, త్రివిక్రమే ఈమధ్య టాలీవుడ్ లో ఎక్కువగా వివాదాలకు కేంద్ర బిందువు అవుతున్నాడు. మొన్న బండ్ల గణేష్.. మాటల మాంత్రికుడిని మనుషులను విడగొట్టే తాంత్రికుడన్నాడు. హిరణ్య కశ్యప ప్రాజెక్టుని తననుంచి లాగేసుకున్న రానా విషయంలో త్రివిక్రమ్ నమ్మక ద్రోహం చేసినట్టు, దర్శకుడు గుణశేఖర్ ట్వీట్లతో తేలిందన్నారు.
ఇప్పుడు బ్రో మూవీలో పవన్ తో పనికిమాలిన పొలిటికల్ డైలాగ్స్ చెప్పించింది త్రివిక్రమే అంటున్నారు. రాసింది తానే అయితే, రాయించింది పవన్ అనేలా త్రివిక్రమ్ మీడియాకు లీకులిస్తున్నాడట. అలా తనకు చుట్టుకున్న కంపుని నైస్ గా పవన్ వైపు మళ్లిస్తున్నాడట. ఇక్కడే పవర్ స్టార్ ఫ్యాన్స్ కి మండిపోతోంది. సోషల్ మీడియాలో ఈ వివాదం డైలీ సీరియల్ లా మారుతోంది.