Pawan Kalyan – Akira Nandan : గూస్‌బంప్స్ తెప్పిస్తున్న పవన్ మాంటేజ్ వీడియో… అకీరా టాలెంట్ కు ఫ్యాన్స్ ఫిదా
అకిరా నందన్(Akira Nandan)... పరిచయం అక్కర్లేని పేరు. పవర్ స్టార్ (Pawan Star) పవన్ కల్యాణ్, (Pawan Kalyan) రేణుదేశాయ్ (Renudesai) ల ముద్దుల కొడుకు. జూనియర్ పవర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న అకీరా ఓ రేంజ్ లో ఫాలోయింగ్ ఉంది.

Pawan's montage video giving goosebumps... fans are mad at Akira's talent
అకిరా నందన్(Akira Nandan)… పరిచయం అక్కర్లేని పేరు. పవర్ స్టార్ (Pawan Star) పవన్ కల్యాణ్, (Pawan Kalyan) రేణుదేశాయ్ (Renudesai) ల ముద్దుల కొడుకు. జూనియర్ పవర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న అకీరా ఓ రేంజ్ లో ఫాలోయింగ్ ఉంది. బయట పెద్దగా కనిపించని పవర్ స్టార్ తనయుడు మల్టీ టాలెంటెడ్. చదువులోనే కాదు.. ఆటపాటలన్నింటిలోనూ ప్రావీణ్యం ఉంది. పియానో వాయిస్తాడు. బాస్కెట్ బాల్ ఆడతాడు. అటు మ్యూజిక్ లో కోర్సులు చేస్తున్నాడు. అయితే ఇప్పుడు మెగా ఫ్యామిలీ సంక్రాంతి సెలబ్రేషన్లలో అకిరా స్పెషల్ పర్ఫామెన్స్ ఇచ్చాడు. తండ్రిపై తనకున్న ప్రేమను పాట రూపంలో పియానో వాయించి బయటపెట్టాడు అకిరా.. యానిమల్ (Animal) సినిమాలోని.. నాన్నా నువ్వు నా ప్రాణం అనినా.. పాటను పియానో వాయించాడు అకీరా.. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారగా… ఇప్పుడు మరో స్పెషల్ వీడియోతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాడు.
ఏపీలో పిఠాపురం (Pithapuram) నుంచి ఎమ్మెల్యే పోటీ చేసిన జనసేనాని (Janasena) పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలిచాడు. పవన్ విక్టరీని మెగా ఫ్యాన్స్‌తో పాటు కొణిదెల ఫ్యామిలీ కూడా సెలబ్రేటీ చేసుకుంది. ఆయన విజయంతో మెగా కుటుంబమంతా ఆనందంలో మునిగి తేలుతుండగా… అకిరా ఆ ఆనందాన్ని డబుల్ చేశాడు. అంతేకాక తన తండ్రిపై ఎంత ప్రేమఉందో మరోసారి బయటపెట్టాడు. ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీని అందుకున్న పవన్ కల్యాణ్ పై చేసిన స్పెషల్ వీడియో వైరల్ గా మారింది. పవన్ జర్నీపై ాయన సినిమాల్లోని డైలాగ్స్ .. సీన్లు ఎడిట్ చేసి ఒక స్పెషల్ వీడియోను చేశాడు. తండ్రి కోసం తనయుడు స్వయంగా ఎడిట్ చేసిన ఆ మాంటేజ్ వీడియోను రేణు దేశాయ్ తన ఇన్‌స్టా అకౌంట్లో షేర్ చేయగా… వైరల్ గా మారింది. కొన్ని రోజుల క్రితం అకిరా వాళ్ల నాన్న కోసం చేసిన వీడియో ఇది ఇంటూ క్యాప్షన్ ఇచ్చారు.
అకిరా తన తండ్రి పవన్ కళ్యాణ్ మూవీ జర్నీ మొత్తాన్ని ఈ వీడియో పోందుపరిచాడు. ఖుషి నుంచి భీమ్లా నాయక్ వరకు పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ డైలాగ్స్, ఇంటెన్సీవ్ సీన్స్ అన్నింటిని కలిపి వీడియోను ఎడిట్ చేశారు. ఇది ఆయనలోని పట్టుదల, ప్రజలకు సేవల చేయాలనే ఆయన అంకితాభావాన్ని నిర్వచిస్తుంది. అకిరా ఎడిట్ చేసిన ఈ వీడియో గూస్‌బంప్స్ తెప్పిస్తుంది. ఇక ఈ వీడియోను అకిరా షేర్ చేయమని చెప్పినట్టుగా రేణు దేశాయ్ రాసుకొచ్చింది. నా లిటిల్ బాయ్‌కి వాళ్ల నాన్నపై ఉన్న ప్రేమ, తన తండ్రి జర్నీపై ఉన్న గర్వానికి ఈ వీడియో నిదర్శనం” అంటూ రేణు దేశాయ్ క్యాప్షన్ ఇచ్చారు. ఇక ఈ వీడియో చూసిన మెగా , పవన్ అభిమానులు మురిసిపోతున్నారు. అంతేకాక అకీరా టాలెంట్ కు ఫిదా అవుతున్నారు.