Pawan Kalyan: ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగులకు పవన్ రెడీ..!
21 రోజుల డేట్స్ ఇచ్చిన పవన్ తన ఓజీ షూటింగ్‌ని ఈ ఒక్క షెడ్యూల్‌లోనే 99 శాతం పూర్తి చేయాలని కండీషన్ పెట్టాడట. మిగతా ఒక శాతం సాంగ్స్ తోపాటు ప్యాచ్ వర్క్‌లకోసం అంటున్నారు. అంతేకాదు ఉస్తాద్ భగత్ సింగ్ కోసం కూడా పవన్ 19 రోజుల డేట్లు కేటాయించాడట.

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ దసరా తర్వాత అక్టోబర్ 25 నుంచి ఓజీ షూటింగ్‌తో బిజీ కానున్నాడు. ఏకంగా 21 రోజుల లాంగ్ షెడ్యూల్‌కి పవర్ స్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. పవన్ లేకుండా ఉండే సీన్లన్నీ తెరకెక్కించిన సుజీత్, ఇక పవర్ సెట్లో లేకుండా.. మిగతా షూటింగ్ చేసేఛాన్స్ లేకపోవటంతో తన రాకకోసమే వేయిట్ చేస్తున్నాడు. అయితే 21 రోజుల డేట్స్ ఇచ్చిన పవన్ తన ఓజీ షూటింగ్‌ని ఈ ఒక్క షెడ్యూల్‌లోనే 99 శాతం పూర్తి చేయాలని కండీషన్ పెట్టాడట. మిగతా ఒక శాతం సాంగ్స్ తోపాటు ప్యాచ్ వర్క్‌లకోసం అంటున్నారు.
అంతేకాదు ఉస్తాద్ భగత్ సింగ్ కోసం కూడా పవన్ 19 రోజుల డేట్లు కేటాయించాడట. అంటే అక్టోబర్ 25 నుంచి డిసెంబర్ 15 వరకు పవన్ ఈ రెండు సినిమాల షూటింగ్స్‌తోనే బిజీ అయ్యే ఛాన్స్ఉంది. సో.. తెలంగాణ ఎలక్షన్స్ సందడి అప్పటిలోగా పూర్తవుతుంది. కాబట్టి జనసేన ప్రచారం తెలంగాణలో ఉండదు కాబట్టి, పొలిటికల్‌గా పవన్ వల్ల నష్టం ఉండే కొన్ని సీట్లలో బ్యాచ్ సేఫ్ అంటున్నారు. అయితే ఓ పార్టీకి సపోర్ట్ అవ్వాలనే ఉద్దేశ్యంతోనే పవన్, తెలంగాణలో పొలిటికల్ జర్నీ చేయకూడదని, అందుకే సాకుగా సినిమాల షూటింగ్‌తో బిజీ అంటూ నటిస్తున్నాడనే యాంటీ ఫ్యాన్స్ కామెంట్లు కూడా పెరుగుతున్నాయి. ఏదేతేనేం.. పవన్ రెండు సినిమాల షూటింగ్స్‌తో బిజీ అయితే, ఏపీ ఎలక్షన్స్ సందడి పెరిగేలోపు అవి రిలీజ్‌కి రెడీ అవుతాయి.