Payal Raj Put: అడ్రస్ లేకుండా పోయింది… అందుకే డ్రెస్ తీసేసింది..?
ఆర్ ఎక్స్ హండ్రెడ్ హిట్ తో టాలీవుడ్ లోనే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అనిపించుకుంది పాయల్ రాజ్ పుత్. కట్ చేస్తే మళ్లీ దిశా దిక్కులేకుండా పోయింది. తర్వాత ఆఫర్లు వచ్చినా ఏది తనని టాప్ హీరోయిన్ గా మార్చలేదు. కట్ చేస్తే తను అడ్రస్ లేకుండాపోయింది కాబట్టే డ్రెస్ వదిలేసి బోల్డ్ గా అందరినీ క్లీన్ బోల్డ్ చేసే సాహసం చేసింది.

Payal Raj Put Upcoming Movie Mangalavaram
ఈ ఘనకార్యానికి కర్త కర్మ క్రియ కూడా అజయ్ భూపతి. మంగళవారం అంటూ ఓ పోస్టర్ వదిలిన టీం, కంటెంట్ తో కాకుండా హీరోయిన్ అందాలతో అందరి అటెన్షన్ లాక్కునే ప్రయత్నం చేసింది. అజయ్ భూపతి కూడా ఆర్ ఎక్స్ హండ్రెడ్ తో హిట్ కొట్టాక, మహాసముద్రం మూవీతో ప్లాప్ ని ఫేస్ చేశాడు.
అలా ఒక హిట్టు, ఒక ఫ్లాప్ తో అడ్రస్ గల్లంతు చేసుకున్నాడు. కనీసం ఆర్ ఎక్స్ హండ్రెడ్ హీరో కార్తికేయ అయినా, కొన్ని హిట్లు, పెద్ద హీరోల మూవీల్లో విలన్ వేశాలతో ప్రయోగాలు చేశాడు. కాని ఆర్ ఎక్స్ హండ్రెడ్ మూవీ టీంలో మాత్రం అడ్రెస్ లేకుండా పోయింది అజయ్ భూపతి, పాయల్ రాజ్ పుతే.. అందుకే మంగళవారం మూవీలో పాయల్ డ్రెస్ లెస్ ఫోసులో ఇద్దరు అడ్రస్ వెతుక్కునే సాహసం చేస్తున్నారనే కామెంట్స్ పెరిగాయి.