Payal Rajput: కెరీర్ మలుపు.. రిషబ్ శెట్టికి పాయల్ స్పెషల్ రిక్వెస్ట్..

కొందరు హిట్స్ కొట్టినా కానీ కెరీర్లో అప్ అండ్ డౌన్స్ ఎదుర్కోక తప్పదు. ప్రస్తుతం పాయల్ రాజ్ పుత్ పరిస్థితి ఇలానే ఉంది. అందుకే తన ఇగోను పక్కనపెట్టేసి కన్నడ సెన్షేషనల్ మూవీ కాంతారాలో నన్ను పరిశీలించండి అంటూ నేరుగా రిషబ్ శెట్టినే అడుగుతోంది

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 13, 2023 | 02:35 PMLast Updated on: Dec 13, 2023 | 2:35 PM

Payal Rajput Asks Actor Rishab Shetty To Let Her Audition For Kantara Chapter 1

Payal Rajput: ఆమెకి అస్సలు ఇగో లేదు. ఏ క్యారెక్టర్ ఇచ్చినా వంద శాతం న్యాయం చేసేందుకే ప్రయత్నిస్తుంది. అందంగానే ఉంటుంది. ఎంట్రీ మూవీతోనే హిట్టందుకుంది కూడా. అయినా టైమ్ ఎందుకో కలసిరావడం లేదు. అందుకే రిషబ్ శెట్టిని రిక్వెస్ట్ చేసే పనిలో పడింది. ఆమె ఎవరో కాదు.. ఆర్ఎక్స్ 100 భామ.. పాయల్ రాజ్‌పుత్. ఇండస్ట్రీలోకి ఎంతో మంది హీరోయిన్స్ వస్తుంటారు. వెళుతుంటారు. కొందరికి మాత్రం అదృష్టం కలిసొచ్చి పాతుకుపోతారు. మరికొందరు హిట్స్ కొట్టినా కానీ కెరీర్లో అప్ అండ్ డౌన్స్ ఎదుర్కోక తప్పదు. ప్రస్తుతం పాయల్ రాజ్ పుత్ పరిస్థితి ఇలానే ఉంది. అందుకే తన ఇగోను పక్కనపెట్టేసి ఛాన్స్ ప్లీజ్ అని సోషల్ మీడియా వేదికగా రిక్వెస్ట్ చేస్తోంది.

Salar : ప్రభాస్ కి నిర్మాతకీ గొడవ.. సలార్ కి నో ప్రమోషన్..

కన్నడ సెన్షేషనల్ మూవీ కాంతారాలో నన్ను పరిశీలించండి అంటూ నేరుగా రిషబ్ శెట్టినే అడుగుతోంది పాయల్. రిషబ్ శెట్టి హీరోగా నటించి దర్శకత్వం వహించిన కాంతారా కన్నడలో విడుదలై సెన్సేషనల్ హిట్ అందుకుంది. కేజీఎఫ్ తర్వాత అందరి దృష్టి మళ్ళీ కన్నడ ఇండస్ట్రీ వైపు చూసేలా చేసింది ‘కాంతార’. దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్‌ రావడంతో ఈ మూవీకి ప్రీక్వెల్ ప్లాన్ చేశాడు రిషబ్ శెట్టి. ప్రస్తుతం ‘Kantara Chapter 1’ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కంప్లీట్ చేసుకుని షూటింగ్ స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతోంది. ఈ టైమ్‌లో ‘Kantara Chapter 1’లో నటించడానికి నటీనటులు కావాలని, ఆడిషన్స్ జరుగుతున్నాయని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అయ్యింది. 30 నుంచి 60 సంవత్సరాల వరకు మగవారు, 18 నుంచి 60 సంవత్సరాల వరకు ఆడవాళ్లు ఈ ఆడిషన్స్‌కి రావచ్చు. Kantara.film అనే సైట్‌లో తమ ప్రొఫైల్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుందని మేకర్స్ తెలిపారు. దీంతో ఈ ఆడిషన్ కాల్ చూసిన RX100 బ్యూటీ పాయల్ రాజ్ పుత్ ఆడిషన్ కోసం ఓపెన్‌గా నన్ను ట్రై చేయండి అంటూ ట్వీట్ చేసింది.

హీరోయిన్‌గా తెలుగులో గ్రాండ్ డెబ్యూ ఇచ్చిన తర్వాత పాయల్ రాజ్‌పుత్‌కు లక్ కలిసిరాలేదు. రీసెంట్‌గా వచ్చిన ‘మంగళవారం’ సినిమాలో తన యాక్టింగ్‌తో మంచి మార్కులు కొట్టేసింది. చాలా కాలం తర్వాత మంచి బ్రేక్ అందుకున్న పాయల్.. తనకు కాంతార ప్రీక్వెల్‌లో నటించాలని ఉందంటూ మనసులో మాట చెప్పింది. కాంతారలో సప్తమి గౌడ ఫిమేల్ లీడ్‌ రోల్‌లో నటించింది. మరి పాయల్ రిక్వెస్ట్‌ను రిషబ్ పరిశీలిస్తాడా..? మంగళవారం చూస్తే మాత్రం తప్పనిసరిగా పాయల్‌కి ఛాన్సిస్తాడా? కాంతారా ప్రీక్వెల్లో ఛాన్సొస్తే పాయల్ కెరీర్ మలుపు తిరిగినట్టేనా..? ఈీ అమ్మడి లక్ ఎలా ఉందో వెయిట్ అండ్ సీ.